జాతీయ వార్తలు

అవిశ్వాసం ప్రతిపాదిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఎన్‌డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలనే ప్రతిపాదనకు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఆమోదం తెలిపాయని కాంగ్రెస్ వెల్లడించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా జరిగేందుకు ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరిస్తాం.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఉభయ సభల్లో చర్చించేందుకు ప్రభుత్వం తమకు ఆవకాశం ఇస్తుందని ఆశిస్తున్నామని కాంగ్రెస్ తెలిపింది. లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే, రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్ మంగళవారం ఏఐసీసీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. ప్రతిపక్షం గొడవ చేయటంవల్లే పార్లమెంటు సమావేశాలు సక్రమంగా జరగటం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపించారు.
ప్రజల సమస్యల గురించి చర్చించాలన్న తమ డిమాండ్‌ను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఖర్గే ఆరోపించారు. లోక్‌సభలో టీవీ తమను చూడదు.. మా మాట వినరు.. మాట్లాడే అవకాశం ఇవ్వరని ఖర్గే దుయ్యబట్టారు. పార్లమెంటు సజావుగా జరిగేందుకు ప్రభుత్వానికి సహకరించాలని సోమవారం జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో నిర్ణయించినట్లు ఖర్గే వెల్లడించారు. ప్రజల సంక్షేమానికి సంబంధించిన పలు సమస్యలను ఉభయ సభల్లో ప్రస్తావిస్తామన్నారు. గత నాలుగేళ్లలో జరిగిన ప్రభుత్వ వైఫల్యాలపై ఉభయ సభల్లో చర్చ జరపాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పెద్దనోట్ల రద్దు మూలంగా జరిగిన నష్టాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్లు పెరగటం తదితర ఆంశాలు ప్రస్తావిస్తామన్నారు. ప్రభుత్వం దురుద్దేశంతో వివాదాస్పద అంశాలను సభ ముందుకు తెచ్చి ఉభయ సభలు సజావుగా జరగకుండా చూస్తోందని గులాం నబీ ఆజాద్ ఆరోపించారు. ధరల పెరుగుదలను ప్రభుత్వం అరికట్టలేకపోయింది, కోటి మందికి ఉపాధి కల్పిస్తామన్న హామీని ఎన్‌డీఏ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది, తామీ అంశాలపై సభలో చర్చకు డిమాండ్ చేస్తామని ఆజాద్ చెప్పారు. తమ రాజకీయ ప్రయోజనాలకోసం దేశాన్ని మతం, కులం ఆధారంగా విభజించి పాలించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆజాద్ ఆరోపించారు. లోక్‌సభ, రాజ్యసభ టీవీల్లో ప్రతిపక్షాలకు సముచిత స్థానం లేకుండాపోతోందని ఆయన చెప్పారు. లోక్‌సభలో బీజేపీకి మెజరిటీ ఉన్నది కాబట్టే మహిళా రిజర్వేషన్ల బిల్లును వెంటనే ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు కంటే ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించటంపైనే బీజేప దృష్టి కేంద్రీకరించిందని ఆజాద్ విమర్శించారు.