జాతీయ వార్తలు

గో సంరక్షణ పేరుతో ఆగడాలు సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: దేశంలో గోసంరక్షణ పేరుతో కొన్ని అల్లరిమూకలు జరిపే హత్యలు, హింసాత్మక సంఘటనలు అరికట్టడానికి పార్లమెంట్ కొత్త చట్టాన్ని చేయాలని, అల్లరిమూకలు ఇక ఏమాత్రం ఆగడాలకు పాల్పడకుండా ఇది ఉండాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. మహాత్మాగాంధీ ముని మనవడు తుషార్ గాంధీ వేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్రంలోని శాంతిభద్రతలను రక్షించాల్సిన విధి రాష్ట్ర ప్రభుత్వాలదేనని చీఫ్ జస్టిస్ దీపక్‌మిశ్రా నేతృత్వంలో జస్టిస్‌లు ఏఎం కన్వీల్కర్, డివై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. గోసంరక్షణ పేరుతో దేశంలో కొన్ని మూకలు పాల్పడుతున్న హింసకు అడ్డుకట్ట వేయడానికి తీసుకోవాల్సిన నివారణ, పరిష్కార, శిక్షాత్మక విషయాలపై కొన్ని సూచనలు చేసింది. పౌరులు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోరాదని, వారు న్యాయపరిరక్షకులు కారాదని, దేశంలో మూకస్వామ్యాన్ని ఎంతమాత్రం అనుమతించేది లేదని వ్యాఖ్యానించింది. అల్లరిమూకలు పాల్పడే చర్యలను సమర్థిస్తూ కొత్త విధానాలు రూపొందించి, చట్టాన్ని వారిచేతిలో పెట్టే చర్యలను అంగీకరించమని బెంచ్ పేర్కొంది. ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు ఆయా రాష్ట్రాలు మూగ, చెవిటి పాత్ర వహించరాదన్నారు. ఇలాంటి సంఘటనలపై చర్యలు తీసుకోవడానికి, వారికి తగిన శిక్ష విధించడానికి కొత్త ప్యానల్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. దేశంలో ఇలాంటి సంఘటనలకు అడ్డుకట్ట వేయడానికి విధి విధానాలు రూపొందించాలని ఆదేశించింది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ కేసును ఆగస్టు 28కి వాయిదా వేసింది. అంతకుముందు మహాత్మాగాంధీ మనవడు తుషార్‌గాంధీ తరఫున సీనియర్ అడ్వకేట్ ఇందిరా జైసింగ్ వాదిస్తూ పశుసంరక్షణ పేరుతో దేశంలో కొన్ని మూకలు చట్టాన్ని చేతిలోకి తీసుకుని పాల్పడుతున్న హింసాత్మక చర్యలు గురించి తెలిపారు. గో సంరక్షణ పేరుతో దేశంలో జరుగుతున్న హింసాత్మక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి సీనియర్ పోలీస్ అధికారులను నోడల్ అధికారులుగా ప్రతి జిల్లాలో వారంలోగా నియమించాలని, దీనిపై రాజస్తాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల స్పందన తెలియజేయాలని గత ఏడాది అక్టోబర్ 6న సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే సుప్రీం ఆదేశాలను ఆ రాష్ట్రాలు పట్టించుకోలేదని, వాటిపై కోర్టు ధిక్కారణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.