జాతీయ వార్తలు

సెక్షన్ 377పై ముగిసిన వాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: స్వలింగ సంపర్కం నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 377పై తీర్పును సర్వోన్నత న్యాయస్థానం రిజర్వులో ఉంచినట్లు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సెక్షన్ 377పై నాలుగు రోజుల పాటు వాదనలను కోర్టు విచారించింది. ఈ నెల 10వ తేదీన సెక్షన్ 377పై కోర్టు విచారణను ప్రారంభించింది. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌మిశ్రా, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖాన్వికర్, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాతో కూడిన ధర్మాసనం విచారించింది. తమ వాదనలకు మద్దతుగా ఈ నెల 20వ తేదీలోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని కోర్టు ఈ కేసులో పార్టీలను ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. అంతకంటే ముందుగా కోర్టు ఈ తీర్పును వెలువరించే అవకాశం ఉంది. అసహజలైంగిక కార్యకలాపాలను సెక్షన్ 377 నేరంగా పరిగణిస్తుంది. ఈ నేరాలు రుజువైతే పదేళ్లవరకు జైలు శిక్షను ఖరారు చేసే అవకాశాన్ని చట్టం కల్పిస్తోంది. పైగా జరిమానాను విధిస్తారు. ఈ కేసులో నృత్యకారుడు నవతేజ్ జౌహర్, జర్నలిస్టు సునీల్ మెహ్రా, చెఫ్ రీతూ దాల్మియా, హోటల్ యాజమాను అమన్ నాథ్, కేశవ్ సూరి, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఆయేషా కాపూర్, ఐఐటికి చెందిన 20 మందికిపైగా విద్యార్థులు పిటిషన్లను దాఖలు చేశారు. సెక్షన్ 377 రాజ్యాంగ విరుద్ధమని. పరస్పర అంగీకారంతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే స్వలింగ సంపర్కులపై (మహిళలు లేదా పురుషులు) నేరానికి పాల్పడినట్లు కేసులు నమోదు చేయడం తగదని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. తొలుత ఎన్‌జీజీ నాజ్ ఫౌండేషన్ 2001లో ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. ఆ తర్వాత 2009, 2013లో సుప్రీంకోర్టులో కూడా ఈ అంశంపై పిటిషన్లు దాఖలయ్యాయి. 2013లో సెక్షన్ 377ను సుప్రీంకోర్టు సమర్ధిస్తూ తీర్పును వెలువరించింది.