జాతీయ వార్తలు

కుల మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: కాంగ్రెస్ ముస్లిం పార్టీ అని ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై వెల్లువెత్తుతున్న బీజేపీ, ఇతరుల విమర్శలపై ఆ పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీ ఎట్టకేలకు వౌనం వీడారు. ‘లైన్‌లో నిల్చున్న చివరి వ్యక్తికి సైతం కాంగ్రెస్ అండగా నిలుస్తుంది. వారిలోని భయాలను తుడిచివేస్తుంది. వారి కులం ఏమిటి, మతం ఏమిటి, వారి విశ్వాసాలు ఏమిటి అన్నది నాకు చాలా చిన్న విషయం’ అని ఆయన ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. నేను మనుషులందరినీ ప్రేమిస్తాను, నేను కాంగ్రెస్ వాదిని అని ఆయన పేర్కొన్నారు. ఇటీవల కొందరు ముస్లిం మతపెద్దలను కలిసినప్పుడు కాంగ్రెస్ ముస్లిం పార్టీ అని రాహుల్ వ్యాఖ్యలు చేసినట్టు ఒక ఉర్దూ డెయిలీ పేర్కొంది.
దీంతో ఆయన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఇటీవల ఆజంఘర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ సైతం దీనిపై విమర్శలు చేశారు. ‘కాంగ్రెస్ ముస్లిం పార్టీ అని రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను ఉర్దూ పేపర్‌లో చదివాను. దీనిపై గత రెండు రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ వ్యాఖ్యలపై నేనేమీ ఆశ్చర్యపోవడం లేదు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు సైతం ఇదేవిధంగా దేశంలోని సహజవనరులపై ముస్లింలకే ప్రథమ హక్కు ఉంటుందని వ్యాఖ్యానించారు’ అని మోదీ విమర్శించారు. అయితే కాంగ్రెస్ ముస్లిం పురుషులకు మాత్రమే మద్దతిస్తుందా అని ఆయన ప్రశ్నించారు. ఎందుకంటే ముస్లిం మహిళల విడాకులకు సంబంధించి వారికి రక్షణ కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ట్రిబుల్ తలాక్ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది కదా? అని ఆయన ప్రశ్నించారు. నిజంగా కాంగ్రెస్‌కు ఈ విషయంలో చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లు పాస్ అయ్యేలా సహకరించాలన్నారు. అలాగే వ్యాపారం పేరుతో భారత్‌లోకి వచ్చి మనదేశాన్ని విభజించి, బ్రిటీష్ పాలనలోకి వెళ్లేలా చేసిన ఈస్టిండియా కంపెనీకి ప్రతిరూపమే బీజేపీ అని కాంగ్రెస్ విమర్శించడాన్ని ఆ పార్టీ నేత రణదీప్ సూర్జిత్‌వాలా ఖండించారు. దీనిపై బీజేపీ వివరణ కోరుతోందని ఆయన డిమాండ్ చేశారు.