జాతీయ వార్తలు

23 మందితో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎట్టకేలకు పార్టీ విధాన నిర్ణయాలకు ఆమోదముద్ర వేసే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. గత మార్చినెలలో ఢిల్లీలోని టల్కటోరా స్టేడియంలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసే అధికారాన్ని రాహుల్ గాంధీకి అప్పగించారు. రాహుల్ గాంధీ దాదాపు నాలుగు నెలల తరువాత మంగళవారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తన వర్గానికి చెందిన వారికి పెద్ద పీట వేసుకున్నారు.
రాహుల్ గాంధీ ఈరోజు ప్రకటించిన వర్కింగ్ కమిటీలో రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి స్థానం కల్పించకపోవటం గమనార్హం. రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఇరవై మూడు మంది సభ్యులున్నారు. వీరితో పాటు 18 మంది శాశ్వత ప్రతినిధులు, 10 మంది ప్రత్యేక ప్రతినిధులు ఉన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు-రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కోశాధికారి మోతీలాల్ వోరా, రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, లోకసభలో పార్టీ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నాయకులు ఏ.కె.ఆంటోని, అహమద్ పటేల్, అంబికాసోని, ఉమెన్ చాందీ, తరుణ్ గొగోయ్, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఆనంద్‌శర్మ, హరీష్‌రావత్, కుమారి సేల్జా, ముకుల్ వాస్నిక్, అవినాష్ పాండే, కె.సి.వేణుగోపాల్, దీపక్ బబారియా, టి.సాహు, రఘువీర్‌మీనా గైకన్‌గమ్,, అశోక్‌గెహ్లోట్. శాశ్వత సభ్యులు-షీలాదీక్షిత్, పి.చిదంబరం, జ్యోతిరాధిత్య సింధియా, బాలాసాహేబ్ తోరట్, తారిక్‌అహమ్మద్ కర్రా, పి.సి.చాకో, జితేందర్ సింగ్, ఆర్.పి.ఎన్.సింగ్, పి.ఎల్.పునియా, రణదీప్ సుర్జేవాలా, ఆశాకుమారి, రజిని పటేల్, రామచంద్రకుంటియా, ఏ.ఎన్.సింగ్, రాజీవ్ సతవ్, శక్తిసింగ్ గోహిల్, గౌరవ్ గగోయ్, ఏ.చెల్లాకుమార్. ప్రత్యేక ఆహ్వానితులు- మునియప్ప, అరుణ్‌యాదవ్, దీపేంద్ర హుడా, జతిన్ ప్రసాదా, కుల్దీప్ విష్ణోయ్, ఐ.ఎన్.టి.యు.సి, ఐ.వై.సి, ఎన్.ఎస్.యు.ఐ, మహిళా కాంగ్రెస్, సేవాదళ్ అధ్యక్షులు.