రాష్ట్రీయం

ఏపీకి న్యాయం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ అవరణలో విడివిడిగా ఆందోళనలు నిర్వహించారు. బుధవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందు పార్లమెంట్ అవరణలోని గాంధీ విగ్రహం ముందు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ఏపీకి న్యాయం చేయాలని, ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. అనంతరం తెలుగుదేశం ఎంపీలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరిగేంత వరకు పార్లమెంట్ లోపాల, బయట తమ నిరసనను కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ నిరసనలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఉభయ సభలకు చెందిన ఎంపీలతో పాటు, వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచి, తెలుగుదేశం పార్టీలో చేరిన ఎంపీ బుట్టా రేణుక కూడా ఉన్నారు.
వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆందోళన
ఏపీ విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలంటూ పార్లమెంట్ అవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైఎసార్‌సీపీ రాజ్యసభ సభ్యులు ధర్నాకు దిగారు. కాగా, రూల్స్ ప్రకారం రాజీనామా చేసిన సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలపకూడదని పార్లమెంట్ ఉద్యోగులు విజ్ఞప్తి చేయడంతో, మాజీ ఎంపీలు ప్లకార్డులు పక్కన పెట్టి తమ పార్టీ రాజ్యసభ సభ్యులకు మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వి.ప్రభాకర్‌రెడ్డితో పాటు అ పార్టీకి చెందిన మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వి సుబ్బారెడ్డి, వరప్రసాద్, అలాగే మాజీ ఎంపీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బాలశౌరి తదితరులు పాల్గొన్నారు.