జాతీయ వార్తలు

మరో ఐదు భాషల్లో చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: రాజ్యసభలో చర్చలకు ఇంత వరకూ 17 భాషలు ఉండగా, అదనంగా మరో ఐదు భాషలను ఈ జాబితాలో చేరుస్తున్నట్టు ఎగువ సభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు. కాగా, ఆంధ్రప్రదేశ్ విభజన హామీలపై వెంటనే రాజ్యసభలో చర్చ చేపట్టాలని తెలుగు దేశం పార్టీ డిమాండ్ చేసింది. బుధవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభంకాగా, రాజ్యసభలో టీడీపీ ఎంపీలు విభజన హామీలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే, సభచైర్మన్ వెంకయ్యనాయుడు ఆ ప్రతిపాదనను తిరస్కరించడంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వాయిదా పడి, తిరిగి సభ మొదలైన తర్వాత, ఇటీవల సభకు ఎంపికైన నూతన సభ్యుల చేత వెంకయ్య నాయుడు ప్రమాణం చేయించారు. అనంతరం ఇటీవల మరణించిన మాజీ రాజ్యసభ సభ్యులకు సభ సంతాపం తెలిపింది. ఇక నుండి సభలో కొత్తగా ఐదు భాషలలో కూడా సభ్యులు ప్రసంగించేదుకు అనుమంతినిస్తున్నట్టు వెంకయ్య నాయుడు ప్రకటించారు. ప్రస్తుతం రాజ్యసభలో 17 భాషాలలో మాట్లాడుతున్నారని ఇక నుంచి డోగ్రీ, కశ్మీరీ, కొంకణ్, సంథాలీ, సింధీ భాషాల వారు తమ సొంత భాషల్లోనే సభలో మాట్లాడవచ్చునని చైర్మన్ వెల్లడించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పత్రాలు అందజేశామని, ఈ సదుపాయాన్ని సభ్యులు ఉపయోగించుకోవాలని సూచించారు. ఇప్పటివరకు 17 భాషలకు మాత్రమే రాజ్యసభలో అనువాదకులు ఉండేవారని, ఇక నుంచి 22 భాషలకు కూడా అనువాదకులు ఉంటారని అన్నారు. అనంతరం వివిధ మంత్రిత్వశాఖలకు చెందిన పత్రాలను చైర్మన్ సభలో సమర్పింపజేశారు. అనంతరం సభా కార్యక్రమాలను మొదలుపెట్టేందుకు చైర్మన్ ప్రయత్నించగా తెలుగుదేశం సభ్యులు సీఎం రమేష్, సుజనా చౌదరి లేచి సభ కార్యక్రమాలు వాయిదా వేసి ఏపీ విభజన చట్టం అమలుపై చర్చించాలని కోరారు. దీనికి చైర్మన్ జోక్యం చేసుకుంటూ తెలుగుదేశం సభ్యులు విభజన హామీల అమలుపై చర్చించాలని నోటీసులు ఇచ్చారని దీనిని పరిశీలనలోకి తీసుకుంటున్నామని దీనిపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రితో చర్చించి స్వల్పకాలిక చర్చకు అనుమతినిస్తామని చైర్మన్ వెంకయ్యనాయుడు తెలిపారు.
అలాగే సీఎం రమేష్‌తో పాటు పలువురి సభ్యులు వివిధ సమస్యలపై సభలో చర్చించేందుకు తనకు నోటీసులు ఇచ్చారని వాటిపై కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చైర్మన్ చెప్పారు. దీనిపై వెంటనే చర్చించాలని తెలుగుదేశం సభ్యుడు సీఎం రమేష్ డిమాండ్ చెయ్యడంతో సీఎం రమేష్‌పై చైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు సభలో తన సీటులో నిలబడి ఏపీకి న్యాయం చేయాలంటూ ప్లకార్డును ప్రదర్శించారు. దీనిపై చైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఇతర పార్టీకి చెందిన సభ్యులు కూడా తామిచ్చిన నోటీసులపై వెంటనే చర్చ జరపాలని డిమాండ్ చేయడంతో సభలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సభ సజావుగా జరిగేలా సహకరించాలని సభ్యులకు చైర్మన్ విజ్ఞప్తి చేశారు. అయినా సభ్యులు వినకపోవడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేసి వెళ్లిపోయారు. 12 గంటల అనంతరం ప్రశ్నోత్తరాలతో చైర్మన్ కొనసాగించారు. పలు అంశాలపై చర్చలకు అవకాశం కల్పించారు.