జాతీయ వార్తలు

కూలిన మిగ్-21 యుద్ధ విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిమ్లా/న్యూఢిల్లీ, జూలై 18: మిగ్-21 యుద్ధ విమానం కూలి పైలట్ మృతి చెందారు. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో బుధవారం జరిగింది. సాధారణ శిక్షణలో భాగంగా పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ నుంచి మధ్యాహ్నం 12.20 గంటలకు బయలుదేరిన ఈ విమానం 1.20 గంటలకు కాంగ్రా జిల్లాలోని ఒక గ్రామంలో కూలిపోయింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇండియన్ ఎయిర్‌ఫోర్సు పైలట్ మృతి చెందాడు. ఈ సందర్భంగా కాంగ్రా పోలీస్ సూపరింటెండెంట్ సంతోష్ పాటియాల్ మాట్లాడుతూ జవాలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మెహ్రాపల్లి ప్రాంతంల్లో ఈ విమానం కూలిపోయిందని చెప్పారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసి రెండు హెలికాప్టర్లలో ఎయిర్‌ఫోర్సు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్టు ఉన్నతాధికారి ఒకరు న్యూఢిల్లీలో వెల్లడించారు.

రెండేళ్లలో 1.10 లక్షల రేప్ కేసులు
న్యూఢిల్లీ, జూలై 18: మన దేశంలో, 2014-2016 మధ్యకాలంలో 1,10,333 రేస్ కేసులు నమోదైనట్టు కేంద్ర మంత్రి కిరెన్ రిజిజూ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆయన వివరణనిస్తూ, 2015లో 34,651 కేసులు, 2014లో 36,735 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. మొత్తం మీద గృహ హింస చట్టం కింద 2016 సంవత్సరంలో 3,38,954 కేసులు, 2015లో 3,29,243 కేసులు రిజిస్టరైనట్టు మంత్రి సమాధానమిచ్చారు.