జాతీయ వార్తలు

స్వీయ నియంత్రణ ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 16: పరిపాలనకు సంబంధించి కార్యనిర్వహక వర్గం తీసుకునే నిర్ణయాల్లో న్యాయవ్యవస్థ జోక్యం ఎంతమాత్రం సమర్థనీయం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలోని అన్ని అంగాలు దేనికది స్వయం నియంత్రణ పాటించాలని జైట్లీ స్పష్టం చేశారు.
న్యాయవ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఉందన్న మిషతో మిగతా సంస్థల కార్యకలాపాల్లో జోక్యం తగదని, న్యాయవ్యవస్థ కూడా సొంతగా లక్షణ రేఖను గీసుకుని దాని పరిధిలోనే పనిచేయడం ఉత్తమమని జైట్లీ సూచించారు. ఇండియన్ విమెన్ ప్రెస్ కోర్ (ఐడబ్ల్యూపిసి)తో ముచ్చటించిన జైట్లీ పలు అంశాలపై మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు ఓట్లేస్తారు, వారికి సమర్థవంతమైన పాలన అందించాల్సిన అవసరం ప్రభుత్వం బాధ్యత అని ఆర్థిక మంత్రి అన్నారు. దీనికోసం కార్యనిర్వహక వర్గం అనేక నిర్ణయాలు తీసుకుంటందన్న జైట్లీ అన్నింటిలోనూ న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం సరైంది కాదని చెప్పారు.

చిత్రం ఇండియన్ విమెన్ ప్రెస్ కోర్ కార్యక్రమంలో మాట్లాడుతున్న అరుణ్ జైట్లీ