జాతీయ వార్తలు

సెప్టెంబర్‌లో భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: అమెరికా, భారత్‌ల మధ్య ప్రాంతీయ, అంతర్జాతీయ, వాణిజ్య అంశాలపై ఈ ఏడాది సెపెంబర్ 6వ తేదీన ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో భారత్ నుంచి విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్, రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్, అమెరికా నుంచి విదేశాంగ కార్యదర్శి పాంపియో, రక్షణ శాఖ కార్యదర్శి జేమ్స్ మాటిస్ పాల్గొంటారు. ఈ సమావేశం వాస్తవానికి ఈ ఏడాది జూలై 6వ తేదీన జరగాల్సి ఉంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం సెప్టెంబర్ 6వ తేదీన జరుగుతుందని అమెరికా ధృవీకరించినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ చెప్పారు. ప్రాంతీయ ఆర్థిక, భద్రత అంశాలపై ఎదురవుతున్న సవాళ్లపై చర్చిస్తారు. గతనెల 26వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ వాషింగ్టన్‌లో పర్యటంచారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 6వ తేదీ సమావేశాలు ఖరారైనట్లు చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో చైనా ఆధిపత్యానికి అడ్డుకట్టవేసే విషయమై రెండుదేశాలు చర్చించనున్నారు. అలాగే భారత్ వాణిజ్య దిగుమతులపై అమెరికా సుంకాలను పెంచడంపై చర్చిస్తారు. రష్యా రక్షణ రంగం ఉత్పత్తులపై అమెరికా ఆంక్ష లు విధించడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రష్యా నుంచి ఎస్- 400 టిరంఫ్ ఎయిర్ డిఫెన్స్ మిసైళ్ల ఒప్పందాన్ని భారత్ ఖరా రు చేసింది. అమెరికా చర్యల వల్ల భారత్‌కు ఈ మిసైళ్ల రాకలో ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. ఈ చర్చల్లో ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఇరుదేశాలు చర్చించనున్నారు.