జాతీయ వార్తలు

సంప్రదింపులు’పై రాజ్యాంగ సవరణకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: నిపుణులు, న్యాయకోవిదులతో చర్చించిన అనంతరం 366 ఆర్టికల్‌లోని ‘సంప్రదింపులు’ అనే పదం నిర్వచనంపై రాజ్యాంగ సవరణకు ప్రయత్నిస్తామని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి పిపి చౌదరి తెలిపారు. 366 ఆర్టికల్‌లోని ‘సంప్రదింపులు’ అనే పదం నిర్వచనంపై రాజ్యాంగాన్ని సవరించాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో టిఎంసి నేత సుఖేందు శేఖర్ రే ఇచ్చిన ప్రైవేట్ బిల్లుపై మంత్రి శుక్రవారం జరిగిన సమావేశంలో వివరణ ఇచ్చారు. న్యాయవాదుల నియామకం తదితర అంశాలతో ముడిపడి ఉన్న 366 ఆర్టికల్‌లో సంప్రదింపులు అనే పదానికి అర్థం వివరించకపోవడంతో దీనిపై విస్తృతమైన ప్రవచనాలు చోటుచేసుకుంటున్నాయని మంత్రి చెప్పారు. అయితే హైకోర్టు, సుప్రీం కోర్టు జడ్జిల నియామకం, జడ్జిల బదిలీ, అదనపు జడ్జిల నియామకం తదితరమైనవి ఆర్టికల్స్ 124, 217, 270 ప్రకారం జరుగుతున్నప్పటికీ 366 ఆర్టికల్‌లోని ‘సంప్రదింపులు’పై విస్తృతమైన చర్చ జరగాల్సి ఉందన్నారు. ఈ బిల్లు అతి ముఖ్యమైనది అయినప్పటికీ ఈ రంగంలో నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలని, కొలీజియం అంశం సుప్రీం కోర్టు పరిశీలనలో ఉన్నందున దీనిపై తగు పరిశీలన అవసరమన్నారు. టిఎంసి నేత సుఖేంద్ శేఖర్ రాయ్ మాట్లాడుతూ జ్యుడీషియరీ విధానంపై ప్రభావం చూపేదయినప్పటికీ ఇది సాధారణ బిల్లు అని వ్యాఖ్యానించారు. ‘సంప్రదింపులు’ అనే పదం రాజ్యాంగంలోని పలు ఆర్టికల్స్‌లో వాడారని, ఇంచుమించు ప్రతి ఆర్టికల్‌లో దీనిని నిర్వచించారని, అంటే ఆ పదాన్ని అంగీకరించినట్టే కదా అని ప్రశ్నించారు. అలాంటప్పుడు ఇప్పుడు మళ్లీ దానిపై విస్తృత చర్చ దేనికని అన్నారు. ఈ బిల్లుతో ప్రజాస్వామ్యానికి ఏమన్నా ప్రమాదం జరుగుతుందంటే తాను వెంటనే దానిని ఉపసంహరించుకుంటానని ఆయన అన్నారు. దేశంలోని అత్యున్నత న్యాయస్థానాల్లో జరిపే నియామకాల్లో పూర్తి పారదర్శకత లేనందున ‘సంప్రదింపులు’, ‘ఏకీభావం’ అనే పదాలపై స్పష్టత ఇవ్వాలని సీపీఐ నేత డి.రాజా డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్ సీపీ ఎంపి వై.విజయసాయిరెడ్డి మాట్లాడుతూ న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడుతూనే ‘సంప్రదింపులు’ అనే పదానికి సరిగా నిర్వచనం చేయాలని సూచించారు. న్యాయమూర్తుల నియామకంలో పారదర్శకత పాటించాలన్నారు. బీజేపీ ఎంపీ భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ రాజ్యాంగంలో ఈ పదానికి నిర్వచనం లేకపోయినా పలు ఆర్టికల్స్‌లో మనకు కన్పిస్తుందని చెప్పారు. అయితే ఈ పదం వల్ల కొన్నిసార్లు డోలాయమాన పరిస్థితి ఏర్పడుతోందని ఆయన అన్నారు.