జాతీయ వార్తలు

ఐఐటీల్లో బాలికల సంఖ్య తగ్గడం ఆందోళనకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖరగ్‌పూర్ (పశ్చిమ బెంగాల్), జూలై 20: దేశ వ్యాప్తంగా ఐఐటీల్లో బాలుర కంటే బాలికలను ఉత్తమ ప్రదర్శనతో రాణిస్తున్నప్పటికీ, వారి సంఖ్య గణనీయంగా తగ్గడం ఆందోళన కలిగిస్తున్నదని రాష్టప్రతి రాంనాథ్ కోవింద్ అన్నారు. ఖరగ్‌పూర్ ఐఐటీ 64వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ 2017లో ఐఐటీ ప్రవేశ పరీక్షకు 1,60,000 మంది హాజరయ్యారని, అయితే, వారిలో బాలికలు 30,000 మంది మాత్రమేనని పేర్కొన్నారు. అదే విధంగా ఐఐటీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో 10,878 మంది అడ్మిషన్ తీసుకున్నారని, వారిలో బాలికలు కేవలం 995 మంది ఉన్నారని వివరించారు. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే, ఐఐటీల్లో బాలికల ఉనికే ప్రమాదకరంగా మారుతుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితి తనను ఆశ్చర్యానికి గురి చేస్తున్నదని, పరిస్థితిని చక్కదిద్దేందుకు సత్వర చర్యలు అవసరమని అన్నారు. ఐఐటీ పరీక్షల్లో బాలుర కంటే బాలికలే ఎక్కువ మార్కులు సాధించడం సంతోషకరమైన అంశమేగానీ, వారి సంఖ్య తగ్గడం ఆందోళనకు గురి చేస్తున్నదని చెప్పారు.
‘నేను దేశం మొత్తం తిరిగాను. దాదాపు ప్రతి చోటా బాలికలకే ఎక్కువ మార్కులు, అధిక సంఖ్యలో పతకాలు వస్తున్నాయి. కానీ, ఐఐటీ వంటి కోర్సుల్లో బాలికల సంఖ్య తగ్గుతున్నది. ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది’ అని రాష్టప్రతి అన్నారు. ఖరగ్‌పూర్ ఐఐటీలో 11,653 మంది విద్యార్థులు నమోదు చేసుకుంటే, వారిలో 1,925 మంది బాలికలు. అంటే మొత్తం విద్యార్థుల సంఖ్య వీరిది 16 శాతం మాత్రమే. బాలికలు, మహిళలు ఉన్నత విద్యను అభ్యసించకుండా, చదువును మధ్యలోనే ఆపేస్తున్నారని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్టప్రతి కోవింద్ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ, బాళికలను ఐఐటీల్లో చేరేలే ప్రోత్సహించడం అత్యవసరమని అన్నారు.