జాతీయ వార్తలు

త్యాగాలతోనే తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: ఎంతో మంది విద్యార్థులు, యువకులు, ప్రజల త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని లోక్‌సభలో టీఆర్‌ఎస్ సభాపక్షం నాయకుడు జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన అప్రజాస్వామికంగా, అశాస్ర్తియంగా జరిగిందని, లోక్‌సభ తలుపులు మూసి, విభజన ప్రక్రియను పూర్తి చేశారని వ్యాఖ్యానించడం ద్వారా తెలుగుదేశం సభ్యులు పార్లమెంటును అవమానించారని జితేందర్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం లోక్‌భలో అవిశ్వాస తీర్మానంపై జరుగుతున్న చర్చ సందర్భంగా టీడీపీ సభ్యుడు గల్లా జయదేవ్ చేసి న ఆరోపణలను ఖండిస్తూ, ప్రజాస్వామ్య విధానంలోనే విభజన జరిగిందని అన్నారు. రాష్ట్ర విభజన అప్రజాస్వామికంగా, అశాస్ర్తియంగా జరిగిందం టూ జయదేవ్ పదేపదే ఆరోపించడం మంచిది కాదని స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ యువకులు ప్రాణ త్యాగం చేస్తుంటే కాంగ్రెస్, బీజేపీ వాస్తవాలను తెలుసుకుని రాష్ట్ర విభజన చేపట్టారనేది విస్మరించరాదని స్పష్టం చేశారు. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలను టీడీపీ నాయకులు మానుకోవాలని జితేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.