జాతీయ వార్తలు

కౌగిలించుకొని.. కన్నుకొట్టి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: ప్రధాని నరేంద్ర మోదీని కౌగలించుకొని, ఆతర్వాత కన్నుగీటి లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అందరినీ విస్మయానికి గురిచేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొన్న ఆయన ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ఉతికి ఆరేసిన రాహుల్ ఆ వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని బలవంతంగా కౌగిలించుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ప్రధానిపై పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించిన రాహుల్ తన ప్రసంగాన్ని ముగించిన అనంతరం హడావుడిగా అధికారపక్షం వైపు వెళ్లి అమాంతం ఆయనను కౌగిలించుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై తన ప్రసంగాన్ని ముగించిన వెంటనే తన వైపు వస్తున్న రాహుల్‌ను చూసి మోదీ తొలుత అవాక్కయ్యారు. మోదీ తన సీట్లో కూర్చుని ఉండగానే రాహుల్ వచ్చి, ప్రధాని మెడ చుట్టూ చేతులు వేసి కౌగిలించుకుని వెనుదిరిగారు. రాహుల్ తనపైకి వంగి మెడచుట్టు చేయి చేసి కౌగిలించుకుంటుంటే మోదీ ఆశ్చర్యంతో ఏమిటిది? అంటూ చేతులతో ప్రశ్నించారు. ఇంతలో తేరుకొని, రాహుల్‌ను దగ్గరకు పిలిచి, షేక్ హాండ్ ఇచ్చారు. ఆయన వీపుపై మెల్లిగా కొడుతూ మాట్లాడారు. రాహుల్‌ను తన వైపులాక్కొని ఆయన చెవిలో ఏదో చెప్పారు. ఇద్దరు నాయకులు కొన్ని సెకండ్ల సేపు నవ్వుకున్న తరువాత రాహుల్ తన సీట్లోకి వచ్చి కూర్చున్నారు. అనంతరం పక్కకు చూస్తూ కన్నుగీటారు. రాహుల్ చర్యలకు బీజేపీ మంత్రులు, ఎంపీలను ఆశ్చర్య చకితులయ్యారు. ‘కాంగ్రెస్ అంటే ఇది. తమ కు ఎవరిపట్ల ద్వేషం ఉండదు. మేము అందరినీ ప్రేమిస్తాము. కాంగ్రెస్‌కు చిరునామా ప్రేమ, అభిమానం. కాంగ్రెస్ అంటే ఏమిటి? హిందు అంటే ఏమిటి? అనేది నరేంద్ర మోదీ, బీజేపీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విమర్శల నుండి నేర్చుకున్నాను’ అని రాహుల్ తమ ప్రసంగంలో వ్యాఖ్యానించారు. ‘శివుడు అంటే ఏమిటనేది కూడా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, నరేంద్ర మోదీ ద్వారా నేర్చుకున్నాను. మీరు నన్ను పప్పు అనవచ్చు. ద్వేషించవచ్చు. కానీ నేను మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తాను. అందరినీ ప్రేమిస్తాను. ఇతరులు నన్ను ద్వేషించినా నేను మాత్రం అందరినీ ప్రేమిస్తునే ఉంటాను’ అన్నారు.
* ఇదేం సంప్రదాయం?: సుమిత్రా మహాజన్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం సభలో ప్రవర్తించిన తీరు ను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తప్పుపట్టారు. అధికార పక్షం వైపు వచ్చి ప్రధాని మోదీని బలవంతంగా కౌగిలించుకోవటాన్ని, కుర్చీ లో కూర్చున్న తర్వాత పక్కకు చూ స్తూ కన్నుగీటడాన్ని స్పీకర్ ఖండించారు. ఇదేం సంప్రదాయమంటూ నిలదీశారు. కౌగిలింతలు, కన్నుగీటడాలు సభా నియమాలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ‘మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఆయన ప్రధానమంత్రి. ప్రధాన మంత్రి వద్ద కు ఇలా వెళ్లటం మంచి పద్ధతి కాదు. ఆయనపై వంగి కౌగిలించుకోవడం కూడా మంచి విధానం కాదు’ అని ఆమె విమర్శించారు. బయట ఎవరినైనా కౌగిలించుకోవచ్చుగానీ, సభలో కాదని వ్యా ఖ్యానించారు. అధికార, ప్రతిపక్షం సభ్యులు కలిసి మెలిసి ఉండాలని తాను కూడా కో రుకుంటానని, అయి తే, ప్రధాన మంత్రి సీటు వద్దకు వెళ్లి ఆయనకు ఇష్టం లేకున్నా కౌగిలించుకోవడం పద్ధతి కాదని ఆమె అన్నారు. ప్రధాన మంత్రి పదవిని గౌరవించవలసిన బాధ్యత మనందరిపై ఉన్నదని సుమిత్రా మహాజన్ స్పష్టం చేశారు. రాహుల్ చర్యలు తనను కూడా ఆశ్చర్యానికి గురిచేశాయని ఆమె చెప్పారు. సభా మర్యాదను కాపాడటం అందరి బాధ్యత అని ఆమె సున్నితంగా హెచ్చరించారు.