జాతీయ వార్తలు

ఏపీ అభివృద్ధికి ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూలై 20: తెలుగుదేశం అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన తప్పులను కప్పిపుచ్చుకోవటంతోపాటు రాజకీయ ప్రయోజనాల సాధన కోసం ఎన్టీయే నుండి తప్పుకున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేయవలసినదంతా చేస్తుందని హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా స్థానంలో అమలు చేస్తున్న ప్రత్యేక ప్యాకేజీ వలన ఏపీకి ఎంతోప్రయోజనం కలుగుతుందని ఉద్ఘాటించారు.శుక్రవారం లోక్‌సభలో తన ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకుబదులిస్తూ చంద్రబాబునాయుడుపై ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు,
వైకాపా అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి రాజకీయంలో పడి గిలగిల్లాడుతున్నారని మోదీ చెప్పారు. ఎన్డీయే నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన వెంటనే తాను చంద్రబాబునాయుడుకు ఫోన్ చేసి జగన్ రాజకీయానికి బలికావద్దని చెప్పినా ఆయన వినిపించుకోలేదని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని, హోదా వల్ల ఎంత లాభం కలుగుతుందో అంతే లాభాన్ని ప్యాకేజీ ద్వారా అందజేస్తున్నామని మోదీ వివరించారు. ఈ ప్యాకేజీని చంద్రబాబు ఆమోదించారని తెలిపారు. జగన్ రాజకీయంలోచిక్కుకున్న చంద్రబాబు బైట పడటం కష్టమని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు, జగన్ మధ్య ఉన్న గొడవలకు పార్లమెంట్‌ను దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే దాని ప్రభావం పక్క రాష్ట్రాలపై కూడా పడుతుందని, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీరప్పమోయిలీ కూడా ఈ విషయం చెప్పారని మోదీ వివరించారు. రాజధాని, రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్రం అన్ని రకాల సహాయం చేస్తుందని, ఏపీ ప్రజలను ఆదుకుంటామన్నారు. ఆంధ్ర అభివృద్ధిలో దేశం అభివృద్ధి ఉందని ప్రధాన మంత్రి తెలిపారు. కాంగ్రెస్ తన రాజజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజించిందని, రాజ్యసభ తలుపులు మూసి అప్రజాస్వామిక పద్దతిలో విభజన జరిపిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ భారత్, పాకిస్తాన్‌లను విడదీసిందని, ఈ రెండు దేశాలూ ఈరోజుకూ కొట్టుకుంటూనే ఉన్నాయన్నారు. ఇదే విధంగా ఆంధ్ర, తెలంగాణ మధ్య కూడా గొడవ కొనసాగుతోందని అన్నారు. ‘కాంగ్రెస్ రాష్ట్ర విభజన ద్వారా తల్లిని చంపి పిల్లను కాపాడిందని చెప్పాను. ఇప్పటికి ఆ మాటకు కట్టుబడి ఉన్నా’నని మోదీ తెలిపారు. విభజన ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనుకున్న కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లో ఓడిపోయిందన్నారు.ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నాయకత్వంలో తెలంగాణ అభివృద్ది పథంలో ముందుకు సాగుతోందని, ఆంధ్రప్రదేశ్ ఇంకా గొడవలో కొట్టుమిట్టాడుతోందంటూ మోదీ తన ఆవేదన వ్యక్తం చేశారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల మధ్య ఉన్న తేడాను తొలగించివేసిందని, కేవలం ఈశాన్య రాష్ట్రాలకు మాత్రమే హోదాను కొనసాగించాలనే సిఫారసు చేసిందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఇస్తే ఏపీకి లభించే ప్రయోజనాలను ప్రత్యేక ప్యాకేజీ ద్వారా కల్పిస్తున్నామని ప్రధాన మంత్రి ప్రకటించారు. తమ ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టం, ప్రత్యేక ప్యాకేజీలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తుందని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.

టీడీపీ ఎంపీల గొడవ
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నామని నరేంద్ర మోదీ ప్రకటించినందుకు నిరసనగా తెలుగుదేశం ఎంపీలు పోడియం వద్దకు వెళ్లి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తూ ప్రధాన మంత్రి ప్రసంగానికి అడ్డుతగిలారు. ప్రధాన మంత్రి ప్రసంగం కొనసాగినంత సేపూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఏపీకి న్యాయం చేయాలంటూ ముక్తకంఠంతో సభ దద్దరిల్లేలా నినాదాలు ఇవ్వటం ద్వారా తమ నిరసన తెలిపారు.