జాతీయ వార్తలు

వీగిపోయన అవిశ్వాసం.... వ్యతిరేకం 325 అనుకూలం 126

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూలై 20: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తెలుగుదేశం ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం భారీ మెజారిటీతో వీగిపోయింది. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 126 ఓట్లు వస్తే వ్యతిరేకంగా 325 ఓట్లు వచ్చాయి. నరేంద్ర మోదీ మంత్రివర్గంపై వచ్చిన అవిశ్వాస తీర్మానం 199 ఓట్ల తేడాతో వీగిపోయింది. తెరాస, శివసేన పార్టీలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. లోక్‌సభలో శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు అవిశ్వాస తీర్మానంపై ప్రారంభమైన చర్చ రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. చర్చకు సమాధానం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షం ముఖ్యంగా కాంగ్రెస్‌పై విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చిన్నపిల్లవాడి మాదిరిగా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. దేశ భద్రత, సైన్యం విషయంలో రాహుల్ గాంధీ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాడని, చిన్న పిల్లవాడి మనస్తత్వంతో ప్రదర్శిస్తున్నాడని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. తనను ప్రధాన మంత్రి పదవి నుండి తొలగించి తాము అధికారంలోకి రావాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ పని చేస్తోందని ఆరోపించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షానికి మెజారిటీ లభిస్తే తానే ప్రధాన మంత్రి పదవి చేపడతాననే ప్రకటన వెనక రాహుల్ గాంధీ అహంకారం దాగి ఉన్నదని అన్నారు. ‘ప్రధాన మంత్రి పదవి కోసం రాహుల్ తహతహతహలాడిపోతున్నారు. అందుకే లేవండి, లేవండి అంటూ నన్ను లేపేందుకు ప్రయత్నించాడ’ని నవ్వుల మధ్య మోదీ అన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు విద్యుత్ అందజేస్తున్నామని,బ్యాంకులను పేద ప్రజల కోసం తెరిపించామని చెప్పారు. 25 లక్షల జన్‌ధన్ ఖాతాలు తెరిపించామని, తల్లులు, ఆడపిల్లల కోసం ఎనిమిది లక్షల మరుగుదోడ్లు నిర్మించామన్నారు. గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, 20 కోట్ల మందికి బీమా రక్షణ కల్పించామన్నారు. ఐదు లక్షల మందికి ఆయుష్మాన్ భవ ద్వారా ఆరోగ్యం అందజేయనున్నట్లు ప్రధాన మంత్రి వివరించారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తున్నామని, 80 వేల కోట్లు ఖర్చు చేసి 99 నీటిపారుదలు ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. 15 కోట్ల మంది రైతులకు సాయిల్ కార్డులు అందజేశామని, యూరియా కొరత తగ్గించాము, బీద ప్రజలకు తక్కువ ధరకు ఎల్‌ఈడీ బల్బులు సరఫరా చేస్తున్నామన్నారు. 13 కోట్ల మంది యువతకు రుణాలు ఇప్పించి ఉపాధి కల్పనకు చర్యలు తీసుకున్నామన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో నాలుగో స్థానానికి చేరుకున్నదని ఆయన వివరించారు. ఒక లక్షా ఇరవై ఐదు వేల షెల్ కంపెనీలను మూసి వేశామని, మరో లక్షల సంస్థలపై దృష్టి పెట్టామని ఆయన చెప్పారు.‘రాహుల్ గాంధీ శివభక్తి గురించి మాట్లాడుతున్నారు. మీరు వచ్చే సంవత్సరం కూడా మా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే స్థాయికి ఎదగాలంటూ’ఆయన కాంగ్రెస్‌ను ఎద్దేవ చేశారు. డోక్లామ్ గురించి మాట్లాడే ముందు ఆలోచించాలని, అన్నింటా చిన్న పిల్లవాడిగా వ్యవహరిస్తే ఎలా? రాఫెల్ డీల్ తదితర దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ప్రజలు క్షమించరని రాహుల్ గాంధీని హెచ్చరించారు. రాఫెల్ డీల్ రెండు బాధ్యత గల దేశాలు, ప్రభుత్వాల మధ్య ఉన్నది తప్ప వ్యాపార సంస్థల మధ్య కాదన్నారు. దేశం సైన్యాధ్యక్షుడి విషయంలో కూడా తప్పుడు భాషను ఉపయోగించారు, దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న సైనికులను అవమానిస్తున్నారని ఆయన కాంగ్రెస్‌ను దుయ్యబట్టారు. మెరుపుదాడులను విమర్శించటం ఏమిటంటూ తిట్టాలను కుంటే మోదీని తిట్టండి , సైనికులను తిట్టోదన్నారు. మెరుపుదాడిని విమర్శిస్తారా? అని ఆయన కాంగ్రెస్‌ను నిలదీశారు.