జాతీయ వార్తలు

బాబ్రీ మసీదు కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: బాబ్రీ మసీదు కేసుకు సంబంధించి గతంలో చేసిన వ్యాఖ్యలను పునఃసమీక్షించడానికి ఉన్నత స్థాయి ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని దాఖలైన పిటిషన్‌పై తీర్పు ను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. అయితే, ఎప్పటికి వాయిదా పడిందనే విషయాన్ని చెప్పలేదు. అయితే, ఈనెల 24లోగా లిఖితపూర్వక వాదనలు అందించాల్సిందిగా సూచించింది. బాబ్రీ మసీదు కేసును విచారించిన సుప్రీం కోర్టు 1994లో పలు వ్యాఖ్యలు చేసింది. ఇస్లాం మతం అంటే కేవలం ఒక మసీదు మాత్రమే కాదని బాబ్రీ వివాదాన్ని ఉద్దేశించి అప్పట్లో స్పష్టం చేసింది. ప్రార్థనలు మసీదులోనే జరగాలన్న నిబంధన ఏదీ లేదని వ్యాఖ్యానించింది. కాగా, బాబ్రీ మసీదు ఎట్టి పరిస్థితుల్లోనూ రామజన్మ భూమిగా పరిగణించడాని కి వీల్లేదని, దీనిని ముస్లిం మత సంస్థలకే కేటాయించాలని కేసు వేసి, ఈ వివాదాన్ని సుప్రీం కోర్టుకు తీసుకెళ్లిన ఎం. సిద్ధిక్ మరణించాడు. అయితే, అతని వారసుడు ఎం. ఇస్మాయిల్ ఫారూ ఖీ ఇప్పటికీ ఆ కేసును కొనసాగిస్తున్నాడు. మసీ దు ఒక్కటే ముస్లింల ప్రార్థనా స్థలం కాదని, ఆ మతం మొత్తానికి మసీదు మాత్రమే ప్రామాణికం కాదని గతంలో సుప్రీం చేసిన వ్యాఖ్యలను, వెలువరించిన తీర్పును ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనంచే పునఃసమీక్షింప చేయాలని తన తాజా పిటిషన్‌లో కోరాడు. కోర్టులో పిటిషనర్ తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్
మాట్లాడుతూ, ఇస్లాం, మసీదు వంటి అంశాలపై ఎలాంటి విచారణను నిర్వహించకుండా, ఎవరి అభిప్రాయాలనూ తీసుకోకుండానే సుప్రీం కోర్టు అప్పట్లో వ్యాఖ్యలు చేసిందన్నారు. బాబ్రీ మసీదు ముస్లింలదేనని అన్నారు. 1991లో చోటు చేసుకున్న బాబ్రీ మసీ దు కూల్చివేతను ఆయన ‘హిందూ తాలిబన్లు’ చేసిన ఉగ్రవాద దాడిగా అభివర్ణించారు. దీనిపై ఒక లాయర్ స్పందిస్తూ, ఒక సంఘటనకు బా ధ్యులైన వారిని విమర్శించకుండా, మొత్తం హిందువులే తాలిబన్లుగా పేర్కొవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే ఆ పదాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అయితే, ధావన్ మాత్రం తాను వెనక్కు తగ్గేది లేదని, బాబ్రీ మసీదు కూల్చివేత ముమ్మాటికీ హిందూ తాలిబన్ చర్యేనని వ్యాఖ్యానించా రు. కేసును విచారిస్తున్న ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఎస్‌ఏ నజీర్‌తో కూడిన సుప్రీం ధర్మాసనం ధావన్‌ను అలాంటి పదా లు వాడవద్దని హెచ్చరించిం ది. అనంతరం ధావన్‌తో ఘర్షణకు దిగిన న్యాయవాదికి భద్రత కల్పించాల్సిందిగా పోలీస్ అధికారులను ఆదేశించింది. కేసు ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. సం బంధిత పార్టీలు ఈనెల 24వ తేదీలోగా లిఖిత పూర్వకంగా అభిప్రాయాలను వెల్లడించాలని కో రింది. సుప్రీం కోర్టు ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించే అవకాశాలు ఉన్నాయి.