జాతీయ వార్తలు

గోప్యత పాటించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: రక్షణ పరికరాల కొనుగోలుకు సంబంధించి ఫ్రాన్స్, భారత్‌ల మధ్య జరిగిన ఒప్పందం భద్రతకు సంబంధించినదని, చట్టపరంగా ఇరుదేశాలు నిర్దేశించిన సమాచారంపై తప్పనిసరిగా గోప్యతను పాటించాల్సి ఉంటుందని ఫ్రాన్స్ ప్రభుత్వం స్పష్టం చేసింది. 2008 నాటి ఒప్పందంపై ఇరు దేశాలు న్యాయపరంగా కట్టుబడి ఉండాలని పేర్కొంది. ఈ మేరకు ఫ్రాన్స్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఒప్పందంపై లోక్‌సభలో ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించిన విషయం విదితమే. ఒప్పందంలోని సమాచారాన్ని పంచుకోవడంలో ఎటువంటి సమస్యలు ఉండవని ఫ్రాన్స్ అధ్యక్షుడు తనకు చెప్పినట్లు రాహుల్ సభలో చెప్పారు. 2008లో ఇరుదేశాలకు కుదిరిన ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని ఫ్రాన్స్‌పేర్కొంది. ఇది చట్టబద్ధమైనది, న్యాయమైనదని పేర్కొంది. ఇందులో వివరాలు బహిర్గతం చేయరాదన్న నిబంధన ఉందని పేర్కొంది. ఈ ఒప్పందంలోని అంశాలు ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్‌కు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఈ ఒప్పందం కీలకమైనదని, వెల్లడించరాదని ప్రకటనలో పేర్కొన్నారు.