జాతీయ వార్తలు

రాఫెల్ కొనుగోళ్లపై దుమారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్‌విమానాల కొనుగోలు ఒప్పందంలో రహస్య క్లాజు లేదన్న ఎఐసిసి అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తోసిపుచ్చారు. శుక్రవారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో ఆమె మాట్లాడుతూ, ఈ ఎయిర్ క్రాఫ్ట్‌ల కొనుగోలుకు సంబంధించిన ప్రాథమిక ఒప్పందం యుపీఏ హయాంలో జరిగిందన్నారు. ఈ ఒప్పందంపై యుపీఏ హయాంలో అప్పటి రక్షణ శాఖమంత్రి ఏకె ఆంటోని సంతకం చేశారని ఆమెచెప్పారు. ఈ ఒప్పందంలోనే ఒక క్లాజులో గోప్యత పాటించాలని నిర్దేశించినట్లు ఆమె చెప్పారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా కొన్ని మీడియా ఏజన్సీలకు ఇచ్చిన ఇంటర్వూల్లో ఒప్పందంలో రహస్య క్లాజు ఉందని స్పష్టం చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. వాణిజ్యపరమైన అంశాలను ఎటువంటి పరిస్థితుల్లో వెల్లడించే అవకాశంలేదన్నారు. వాణిజ్య పరమైన ఒప్పందమైనందు వల్ల వీటి కోసం పోటీదారులు ఉంటారని, అందుకే వివరాలను వెల్లడించరాదనే నిబంధన ఉన్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు పదేపదే స్పష్టం చేసిన విషయాన్ని ఆమె చెప్పారు. రాహల్ గాంధీ రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్‌లపై చేసిన ప్రకటనలు అవాస్తవాలన్నారు. ఈ అవాస్తవాలకు ఆధారాలు లేవన్నారు. అంతకుముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ రాఫెల్ ఒప్పందంపై కేంద్రం అవాస్తవలు చెబుతోందని విమర్శించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు తనతో మాట్లాడుతూ ఈ ఒప్పందంలో రహస్య క్లాజు లేదని చెప్పారని రాహుల్ గాంధీ అన్నారు. ఈ ఒప్పందాన్ని ప్రత్యేకంగా ఒక కాంట్రాక్టర్‌కు ఎందుకు ఇచ్చారని, దీనికి ప్రధానమంత్రి బదులివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కాంట్రాక్టు హిందూస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అనే ప్రభుత్వ రంగ సంస్థకు దక్కాల్సి ఉందన్నారు. ఈ మతలబు వెనక కారణాలేమిటో ప్రధాని వివరించాలన్నారు. దీని వల్ల కాంట్రాక్టు పొందిన వ్యక్తికి రూ.45వేల కోట్ల ప్రయోజనం కలిగిందన్నారు. భారత్, ఫ్రాన్స్‌కు మధ్య 2016లో 36 రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలుకు సంబంధించి రూ.58వేల కోట్ల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని బహిర్గతం చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.