జాతీయ వార్తలు

మూక హింసకు మరొకరి బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, జూలై 21: గోవులను అక్రమరవాణా ఆరోపణపై మరో వ్యక్తి మూక హింసకు బలయ్యాడు. ఈ ఘటన రాజస్తాన్‌లోని ఆళ్వార్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని లాల్వండి ప్రాంతంలో అక్బర్ ఖాన్ అనే 28 సంవత్సరాల యువకుడు మరో వ్యక్తితో కలిసి రెండు ఆవులను తీసుకెళుతుండగా ఈ ఘటన జరిగింది. వీరు గోవులను అక్రమ రవాణా చేస్తున్నారనే అనుమానంతో వీరిపై స్థానిక ప్రజలు సామూహికంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఖాన్ ఆసుపత్రిలో మృతి చెందాడని రామ్‌గర్ పోలీసు అధికారి సుభాష్ శర్మ చెప్పారు. కాగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి వసుంధర రాజే తీవ్రంగా స్పందించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, కేసు దర్యాప్తుకు విచారించినట్లు చెప్పారు. కాగా ఈ ఘటనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. గత ఏడాది రాష్ట్రంలో పెహ్లూ ఖాన్ అనే వ్యక్తిని గోవులను తరలిస్తున్నారనే అనుమానంతో ప్రజలు దాడి చేయగా మరణించాడని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కాగా తాజాగా మూక హింసకు బలైన అక్బర్ ఖాన్ కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనను హత్యా నేరంగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీలు చెప్పారు. ఈ కేసులో ధర్మేంద్ర యాదవ, పరంజిత్ సింగ్ సర్దార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడి కథనం ప్రకారం తనపై ఐదుగురు వ్యక్తులు దాడి చేశారని పోలీసులు చెప్పారు. తాను తన స్నేహితుడు అస్లాం కలిసి లాడ్‌పూర్ గ్రామంలో ఆవులను కొనుగోలు చేసి హర్యానాలోని నుహ్ జిల్లా కోల్గావ్‌కు తీసుకెళుతుండగా ఈ దాడి జరిగిందన్నారు. ఖాన్, అస్లాంపై గోవులు అక్రమ రవాణా చేస్తున్నారనే అభియోగాలు ఏమీ లేవన్నారు.