జాతీయ వార్తలు

ఇంకా వరదల్లోనే కేరళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, ఆగస్టు 13: భారీ వర్షాలు, వరదలతో కేరళ రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. సోమవారం తాజాగా కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరదనీటి ప్రభావం మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో మత్య్సకారులెవరూ చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇడుక్కి హిల్ జిల్లాలోని ఇడుక్కి డ్యామ్‌లోకి భారీగా చేరుకున్న వరద నీటిని ఎర్నాకుళం జిల్లాలోని కింది ప్రాంతాలకు వదలడంతో డ్యామ్‌లో ప్రస్తుతం నీటిమట్టం 2,397.58 అడుగులుగా ఉంది. ఇడుక్కి డ్యామ్ నుంచి వరద నీటిని కిందకు వదలడం వల్ల ప్రస్తుతానికి వచ్చే ముప్పేమీ లేదని అధికారులు పేర్కొంటున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్టవ్య్రాప్తంగా 60వేలకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. మృతుల సంఖ్య 39కి చేరుకుంది. కేరళ, లక్షద్వీప్ సముద్రతీర ప్రాంతాల్లో గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీస్తుండడం, ఒక్కోసారి గంటకు 60 కిలోమీటర్ల వరకు గాలులు వీయవచ్చునని అధికారులు తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మత్యకారులెవరూ సముద్రంలోకి వెళ్లొద్దని వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఆర్మీ, మద్రాస్ రెజిమెంట్‌కు నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్‌డీఆర్‌ఎఫ్‌లకు చెందిన దళాలు తీవ్రంగా నష్టపోయిన కోజీకోడ్, ఇడుక్కి, మలప్పురం, కన్నూర్, వాయనద్ జిల్లాల్లో సహాయ చర్యలు ముమ్మరం చేస్తున్నాయని రక్షణ శాఖ అధికార వర్గాలు తెలిపాయి.
ముఖ్యంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరదలు, భారీ వర్షాలు చెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. లెక్కకు మించినన్ని చెట్లు కూకటివేళ్లతో కూలిపోయాయి. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. పర్యాటకరంగంపై వర్షాలు, వరదల ప్రభావం మరింత ఎక్కువైంది. ఇడుక్కి, మున్నార్, కుమారక్కోమ్ తదితర పర్యాటక ప్రాంతాల్లోని వివిధ హోటళ్లు, రిసార్టుల్లో ఇప్పటికే బుక్ చేసుకున్న గదులను రద్దు చేశారు. కేరళ టూరిజం విభాగం ఆధ్వర్యంలో ఈనెల 11న భారీ ఎత్తున నిర్వహించాలనుకున్న చాంపియన్స్ బోట్ లీగ్ (బీపీఎల్)ను వాయిదా వేశారు. భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అంతటా సహాయక చర్యలు కొనసాగుతున్నందున ఈ పోటీలను ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత ప్రకటిస్తామని కేరళ టూరిజం శాఖ డైరెక్టర్ పి.బాలకిరణ్ తెలిపారు. వచ్చే వారంలో రాష్టమ్రంతటా ఓనం ఉత్సవాలు జరుగునున్న తరుణంలో వరద ప్రభావిత ప్రాంతాలకు మినహాయింపు ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న ప్రజలు తమ ఇళ్ల నుండి అవసరమైన వస్తు సామాగ్రిని తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. వివిధ సహాయ శిబిరాల వద్ద వేలాది మంది జనం గుమికూడుతున్నారు. కాగా, తేయాకు, కాఫీ, రబ్బర్, యాలకలు తదితర తోటలు 35 నుంచి 40 శాతం వరకు దెబ్బతినడంతో 600 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు కేరళ అసోసియేషన్ ఆఫ్ ప్లాంటర్స్ కార్యదర్శి బీకే అజిత్ తెలిపారు.