జాతీయ వార్తలు

లోక్‌సభను రద్దు చేయండి - మళ్లీ ఎన్నికలు నిర్వహించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 14: ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలతో పాటు ఎన్నికలు నిర్వహించడానికి ప్రధాని మోదీ లోక్‌సభను రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ సవాల్ విసిరారు. మోదీకి గనుక ధైర్యం ఉంటే లోక్‌సభను రద్దు చేసి సాధారణ ఎన్నికలు ప్రకటించాలని, తాము ఎన్నికలకు సిద్ధమేనని ఆయన చెప్పారు. ఈ ఏడాది జరగబోయే నాలుగు అసెంబ్లీలతో పాటు మొత్తం 12 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికలతోపాటు నిర్వహించాలని బీజేపీ చీఫ్ అమిత్ షా లా కమిషన్‌ను నిన్న కోరిన నేపథ్యంలో మంగళవారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో గెహ్లాట్ మాట్లాడుతూ మిజోరామ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల శాసనసభల కాలపరిమితి ఈ ఏడాది ముగిస్తున్నందున వాటికి ఎన్నికలు నిర్వహించాలని, అయితే వాటితో పాటు లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించాలంటే ఆ శాసనసభల కాలపరిమితిని పెంచడమో, తగ్గించడమో చేయాలని, రాజ్యాంగపరంగా అది సాధ్యం కాదు కాబట్టి పార్లమెంట్‌ను రద్దు చేసి ఆ నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో లోక్‌సభ ఎన్నికలను కూడా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలా చేస్తే తాము స్వాగతిస్తామని, ఎన్నికలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని ఆయన చెప్పారు.