రాష్ట్రీయం

హింసకు తావులేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 14: దేశంలో దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకునే ప్రస్తుత తరుణంలో వివాదాలకు ఆస్కారం కల్పించరాదని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ప్రజలకు పిలుపునిచ్చారు. 72వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని మంగళవారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. మహాత్మాగాంధీ బోధించిన అహింస అనే ఆయుధం హింస కంటే ఎంతో శక్తివంతమైనదిగా గుర్తించాలని ఆయన సూచించారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవల జరిగిన మూకదాడులను ఆయన ప్రస్తావించారు. సమాజంలో మహిళా శక్తి, మహిళల ప్రాధాన్యత ఎంతో ఉత్కృష్టమైనదని, వారి భద్రతకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ ప్రజలను ఆదుకునే విషయంలో రైతులు, దేశాన్ని రక్షించే విషయంలో సైనిక దళాలు, శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు నిర్వహిస్తున్న బాధ్యతలను ప్రశంసించిన రాష్టప్రతి ‘తమ బాధ్యతలను చిత్తశుద్ధితో, నిబద్ధతతో నిర్వహించే ప్రతి భారతీయుడు స్వాతంత్య్ర పోరాట ఆదర్శాలను కాపాడుతున్నట్టే’ అని పేర్కొన్నారు. మనం తీసుకునే నిర్ణయాలు, పెట్టే పెట్టుబడులు సామాజికంగా, ఆర్థికంగా వేసే ప్రతి అడుగు మన గమనాన్ని నిర్ధేశిస్తాయని రాష్టప్రతి తెలిపారు. భారతదేశంలో ప్రస్తుతం పరివర్తన, అభివృద్ధి వేగం ప్రశంసనీయ స్థాయిలో ఉందని పేర్కొన్న ఆయన ఇది భారతీయ ఆలోచనలకు అద్దం పడుతోందని తెలిపారు. సమాజంలో మహిళలకు ప్రత్యేక పా త్ర ఉందని ఉద్ఘాటిస్తూ దేశంలో ఎంతగా స్వేచ్ఛ విస్తరిస్తే అంతగానూ మహిళలు భిన్నరంగాల్లో రాణించడానికి ఆస్కారం ఉం టుందన్నారు. తల్లి అయినా, సోదరి అయినా, భార్య అయినా, కుమార్తె అయినా ప్రతి మహిళ తాను ఎంచుకున్న రాణించగలి గే స్వేచ్ఛను కలిగి ఉండాలని, అందుకు తగ్గ రీతిలో అవకాశాలు, భద్రతలను వారికి కల్పించాలని రాష్టప్రతి పిలుపునిచ్చారు.