జాతీయ వార్తలు

దివ్యాంగులకు ప్రత్యేక గ్యాలరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 15: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎర్రకోట నుంచి ఉద్దేశించి చేసిన ప్రసంగం వినేందుకు వచ్చిన ఆహుతుల్లో ఈ సారి దివ్యాంగులకు ప్రత్యేక గ్యాలరీని కేటాయించారు. పైగా మూగ, బధిర విద్యార్థులకు ప్రధాని మోదీ ప్రసంగం విశేషాలను తెలియచేసేందుకు సంజ్ఞల ద్వారా తెలియచేసే సాంకేతిక భాషా నిపుణులను నియమించారు. మోదీ ప్రసంగం సాగుతున్నంత సేపు దివ్యాంగులు మోదీ ప్రసంగ విశేషాలను సంజ్ఞల భాష ద్వారా తెలుసుకుని ఉద్వేగానికి లోనయ్యారు. దాదాపు 120 మంది దివ్యాంగులైన విద్యార్థులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. దాదాపు గంటన్నరసేపు జరిగిన మోదీ ఉపన్యాసాన్ని శ్రద్ధగా చూశారు. తన సుదీర్ఘ ఉపన్యాసంలో మోదీ దివ్యాంగుల హక్కుల గురించి వివరించారు. భారత్‌లో తొలిసారిగా సంజ్ఞల భాష సాంకేతిక పదాలతో నిఘంటువును ఈ ఏడాది మార్చి నెలలో విడుదల చేశారు. ఇండియన్ సైన్ లాంగ్వేజి రీసెర్చి ట్రైనింగ్ సెంటర్‌ను ఈ నిఘంటువును రూపొందించింది. సుగమ్య భారత్ అనే సంస్థ దివ్యాంగులను ఈ వేడుకలకు ఆహ్వానించి ఏర్పాట్లు చేసింది. పండిత దీనదయాళ్ ఉపాధ్యాయ జాతీయ దివ్యాంగుల సంస్థ , కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ దివ్యాంగులను ఎంపిక చేసింది. ప్రధానమంత్రి ఉపన్యాసాన్ని సంజ్ఞల ద్వారా వివరించే బాధ్యతను సాయి స్వయం సొసైటీ అనే సంస్థకు అప్పగించారు.

కాశ్మీరీలను అక్కున చేర్చుకుంటాం: మోదీ
జమ్ముకాశ్మీర్‌లో త్వరలోనే పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలు జరిపిస్తామని ప్రధాని మోదీ వెల్లడించారు. కాశ్మీర్ ప్రజలను అక్కున చేర్చుకుంటామని, ‘గోలి, గాలి’ (తుపాకీ గుళ్లు, తిట్ల)తో కాదని ఆయన వక్కాణించారు. జమ్ముకాశ్మీర్ విషయంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి చూపిన - ‘ఇన్సానియత్, కాశ్మీరియత్, జమ్హురియత్’ బాటలోనే పయనిస్తామని ప్రకటించారు. కాశ్మీర్‌లోని లడఖ్, జమ్ము, శ్రీనగర్ లోయ తదితర ప్రాంతాలను అట్టడుగు నుంచి సమాన స్థాయిలో అభివృద్ధి చేస్తామని అన్నారు. ఇప్పటివరకూ కేంద్ర నిధులు నేరుగా గ్రామస్థాయికి చేరేవి కావని, పంచాయతీ ఎన్నికల అనంతరం గ్రామాలు పటిష్టమవంతం అవుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో నీటి పారుదల పథకాలు ఊపందుకున్నాయని, దాల్ లేక్ పునర్వ్యవస్థీకరణ పనులు జరుగుతున్నాయని, ఐఐటీ, ఐఐఎమ్, ఎయిమ్స్ వంటి సంస్థల ఏర్పాటు తగిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.