జాతీయ వార్తలు

పాక్ పార్లమెంట్‌కు కొత్త స్పీకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 15: పాకిస్తాన్ పార్లమెంట్‌కు ఇటీవల ఎన్నికైన సభ్యులు కొత్త స్పీకర్‌ను ఎన్నుకున్నారు. ప్రధానిగా ప్రమాణం చేయబోయే ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్‌కి చెందిన అసద్ ఖైజర్‌ను పార్లమెంట్ దిగువ సభకు స్పీకర్‌గా ఎన్నుకున్నట్టు డాన్ న్యూస్ వెల్లడించింది. ఖైజర్ తన ప్రత్యర్థి, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన చెందిన సయ్యద్ ఖుర్షీద్ షాపై విజయం సాదించారు. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో జరిగిన ఈ ఎన్నికలో కైజర్‌కు 176 ఓట్లు రాగా, అతని ప్రత్యర్థి షాకు 146 ఓట్లు వచ్చాయి, ఎనిమిది ఓట్లు చెల్లలేదు. ఇప్పటివరకు స్పీకర్‌గా ఉండి నిష్క్రమిస్తున్న ఆయజ్ సాదిక్ ఖైజర్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఖైజర్ విపక్ష నేతలకు కరచాలనం చేశారు. కాగా కొత్తగా ఎన్నికైన స్పీకర్ ప్రధాని ఎన్నికను పర్యవేక్షిస్తారు. అలాగే డిప్యూటీ స్పీకర్‌గా పిటీఐ తరఫున కాశీం సూరి, అసద్ రెహమాన్ విపక్షాల తరఫున పోటీలో ఉన్నారు. కాగా సోమవారం ఇమ్రాన్‌ఖాన్ సహా 329 మంది కొత్తగా ఎన్నికైన సభ్యులు పదవీ ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా పీటీఐ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షా మహమూద్ మాట్లాడుతూ ఈనెల 18న తమ పార్టీ పూర్తి మెజారిటీని నిరూపించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇలావుండగా జూలై 25న జరిగిన పాక్ ఎన్నికల్లో 116 స్థానాలు గెల్చుకున్న ఇమ్రాన్‌కు చెందిన పీటీఐ అతి పెద్ద పార్టీగా అవతరించింది. తర్వాత తొమ్మిది మంది స్వతంత్ర అభ్యర్థులు, ఇతరులు ఆ పార్టీలో చేరడంతో ఆ పార్టీ బలం 158కు చేరుకుంది.

కొత్తగా ఎన్నికైన పాక్ నేత హల్‌చల్
పాకిస్తాన్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్‌కు చెందిన పీటీఐ తరఫున ఎన్నికైన ఒక సభ్యుడు నడిరోడ్డుపై హల్‌చల్ చేశాడు. తన వాహనాన్ని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నం చేశాడన్న ఆగ్రహంతో సింధ్ అసెంబ్లీ నుంచి ఎన్నికైన ఇమ్రాన్ ఆలీషా ఒక డ్రైవర్‌ను పట్టుకుని చితకబాదుతున్న వీడియో వైరల్ కావడంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆర్థోపెడిక్ సర్జన్ కూడా అయిన ఆ నేత తన చుట్టూ పార్టీ నేతలు, సాయుధ బాడీగార్డులు ఉండగా ఒక వ్యక్తిని పట్టుకుని స్థానిక స్టేడియం దగ్గర చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పీటీఐ అధినేత ఇమ్రాన్ నివారణ చర్యలు చేపట్టారు. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని ఆ సభ్యుడికి పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. తమ పార్టీ నుంచి ఎన్నికైన ప్రతినిధులు ప్రొటోకాల్ పాటించకుండా బయట తిరిగి ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని ఒకపక్క ఇమ్రాన్ ఆదేశాలు జారీ చేసినా, కొందరు నేతలు ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టడం పార్టీ ఆ పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఆ నేత ఇమ్రాన్ అలీషా వివరణ ఇస్తూ వీడియోలో కన్పిస్తున్నది సగం నిజం మాత్రమేనని పేర్కొన్నారు. వాస్తవానికి ఆ డ్రైవర్ ఒక వృద్ధుడిని తిడుతూ బాధపెడుతుండగా, తాను అడ్డుకున్నానని వివరణ ఇచ్చాడు. కాగా తన మనవలను తీసుకుని ఆసుపత్రికి తీసకుని వెళ్తుండగా, తమ కాన్వాయ్‌కి అడ్డువచ్చావంటూ ఇమ్రాన్ అలీషా తనపై చేయి చేసుకున్నాడని బాధిత డ్రైవర్ ఆరోపించాడు.