జాతీయ వార్తలు

ప్రపంచ దేశాల నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మహోన్నత వ్యక్తిత్వం ఉన్న నేత: అమెరికా ఇండియా ఫౌండేషన్
న్యూఢిల్లీ/బీజింగ్/న్యూయార్క్, ఆగస్టు 17: మాజీ ప్రధాని వాజపేయి మృతిపై ప్రపంచ దేశాలకు చెందిన నేతలు, రాయబారులు, దౌత్యవేత్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వాజపేయి ప్రపంచ శాంతి, అభివృద్ధికి చేసిన కృషిని వారు గుర్తు తెచ్చుకున్నారు. అమెరికా, రష్యా, జపాన్ దేశాలు వాజపేయి హయాంలో తమదేశాలతో జరిపిన చర్చలు, సంబంధాలు అభివృద్ధికి చేసిన కృషి అద్భుతమని పేర్కొన్నాయి. వాజపేయి హయాంలో భారత్-చైనా మధ్య సంబంధాలు కొత్త మలుపు తిరిగాయని, గొప్పనేత అని చైనా సెంటర్ ఫర్ స్ట్రాటేజిక్ స్టడీస్ డైరెక్టర్ మా జిలీ అన్నారు. 2003లో చైనాను వాజపేయి సందర్శించారని, ఆ పర్యటన వల్ల ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా ఇరు దేశాల మధ్య రాకపోకలు పెరిగాయన్నారు. వాజపేయి గొప్ప దార్శనికత ఉన్న నేతని ఆయన నివాళులు అర్పించారు. వాజపేయి హయాంలో ప్రత్యేక ప్రతినిధి ఆధ్వర్యంలో యంత్రాంగాన్ని ఏర్పాటైందన్నారు. పోఖ్రాన్ అణు పరీక్షల వల్ల చైనాకు ఆగ్రహం కలిగించిందని, కాని దక్షిణాసియాలో భద్రత పరంగా తమ సత్తా చూపేందుకు మాత్రమే ఈ ప్రయోగం చేశామని వాజపేయి చెప్పారన్నారు. వాజపేయి కృషి వల్ల ఇంతవరకు ఇరుదేశాలకు చెందిన భద్రతాధికారులు, సలహాదారులు 20 సార్లు సమావేశమయ్యారన్నారు. 21వ భద్రతాపరమైన చర్చలు త్వరలో జరుగుతాయన్నారు. భారత్-చైనా మధ్య స్నేహాన్ని ఆకాంక్షించి, ఫలించే దిశగా చర్యలు తీసుకున్న ఏకైక నేత వాజపేయి అని చైనాలో సరిహద్దు నిపుణుడు దాయి బింగో పేర్కొన్నారు. 2004లో వాజపేయి మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే సరిహద్దు సమస్యలు, చిక్కుముళ్లకు పరిష్కారం దొరికి ఉండేదన్నారు. భారతదేశం గర్వించదగిన గొప్పనేతల్లో వాజపేయి ఒకరని అమెరికన్ ఎంబసీ ప్రకటన విడుదల చేసింది. అమెరికా-్భరత్ సంబంధాలు ఉన్నత స్థితికి వెళ్లేందుకు వాజపేయి చొరవ కారణమని పేర్కొన్నారు. రాజనీతిజ్ఞుడు, దార్శనికుడు వాజపేయి అని భారత్‌లో రష్యా రాయబారి నికొలయ్ కుద్సేవ్ నివాళులు అర్పించారు. ప్రపంచ దేశాల ఆదరాభిమానుల పొందిన మహనీయుడు అని జపాన్ రాయబరి కేంజి హిరామట్సు పేర్కొన్నారు. వాజపేయి శాంతికాముకుడని, గొప్ప రాజనీతిజ్ఞుడని న్యూయార్కులో అమెరికన్ ఇండియా ఫౌండేషన్ పేర్కొంది. వాజపేయి మహోన్నత వ్యక్తిత్వం ఉన్న నేతని, ఆయన మృతి తమను కలచివేసిందని ఆ సంస్థ సీఈవో నిశాంత్ పాండే పేర్కొన్నారు. భారతదేశం అభివృద్ధికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని ఆయన నివాళులు అర్పించారు.