క్రైమ్/లీగల్

మూడు మీటర్లు తగ్గించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేరళను ముంచెత్తుతున్న వరదలను నియంత్రించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని జాతీయ ప్రకృతి విపత్తుల నియంత్రణ కమిటీ (ఎన్‌సీఎంఆర్‌సీ)ని సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశించింది. ఇందుకు సంబంధించి కేరళ సబ్‌కమిటీతో సమన్వయంగా పనిచేయాలని కోర్టు సూచించింది. ప్రత్యేకించి ముల్ల పెరియార్ డ్యాంలో నీటి స్థాయి ప్రాణాంతకంగా మారినందువల్ల ఈ డ్యాంలో నీటిని మూడు మీటర్ల మేర తగ్గించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. అంతేకాకుండా భారీ వర్ష బీభత్సం నేపథ్యంలో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం, వరదల ఉద్ధృతిని తగ్గించడం వంటి కార్యక్రమాలు చేపట్టేందుకు జాతీయ ప్రకృతి విపత్తుల నియంత్రణ కమిటీ సూచనలను అనుసరించాలని ధర్మాసనం కేరళ, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ముల్లపెరియార్ ఆనకట్ట నీటిమట్టం ప్రస్తుతం 142 మీటర్లు ఉందని, దీన్ని 139 మీటర్లకు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని ధర్మాసనం ఆదేశించింది. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలను నియంత్రించే సామర్థ్యం మీకు లేకుంటే ఆ బాధ్యతలను ఉన్నతాధికారులకు వదిలేయడం మంచిదని సుప్రీం ధర్మాసనం సూచించింది. ఇప్పటి వరకు ప్రకృతి వైపరీత్య నివారణకు, బాధిత ప్రజల పునరావాసానికి ఏమి చర్యలు చేపట్టారో నివేదిక సమర్పించాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దక్షిణాదిన వర్షాలు సృష్టిస్తున్న విలయంలో వరదలకు ఇప్పటి వరకు 167 మందికి పైగా దుర్మరణం పాలయ్యారని ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాసనం వరదలను సక్రమంగా నియంత్రించలేని కారణంగానే ఇలా జరుగుతోందని, ప్రత్యేకించి ముల్లపెరియార్ ఆనకట్ట అన్ని గేట్లూ ఎత్తివేయడం వరద ఉద్ధృతికి దారితీసిందని, అలాగే రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులైన చెరుతోని, ఇడుక్కి రిజర్వాయర్‌లోని ఒక భాగం, ఇడమలయార్ ప్రాజెక్టుల కారణంగా లోతట్టు ప్రాంతాల జనజీవనం అస్తవ్యస్తమైందని ధర్మాసనం పేర్కొంది.