జాతీయ వార్తలు

వాజపేయి చితాభస్మం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి చితాభస్మం (అస్థికలు) దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పవిత్ర నదుల్లో నిమజ్జనం జరుగనుంది. ఈ కార్యక్రమం హరిద్వార్‌లోని గంగానది నుంచి ఆదివారం ప్రారంభం కానుంది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ నుంచి త్రివేంద్ర సింగ్ రావత్ తదితరులు హరిద్వార్‌కు తరలివచ్చి ఈ పవిత్ర కార్యంలో పాల్గొంటారని బీజేపీ నేత భూపేందర్ యాదవ్ శనివారం నాడిక్కడ విలేఖరులకు తెలిపారు. తొంభై మూడేళ్ల మహానేత అటల్ బిహారీ వాజపేయి గత గురువారం సాయంత్రం కన్నుమూయగా ఆయన పార్ధివ దేహానికి ప్రభుత్వ లాంఛనాల నడుమ స్మృతి స్థల్‌లో శుక్రవారం అంతమ సంస్కారాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ఈనెల 20న ఢిల్లీలోఅఖిల పక్షాల సమావేశాన్ని నిర్వహించి వాజపేయి ఆత్మశాంతికి ప్రత్యేక ప్రార్థనలు జరపాలని నిర్ణయించామని ఈ సందర్భంగా యాదవ్ చెప్పారు. అలాగే లక్నోలో సైతం 23న ఇలాంటి ప్రార్థన సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాజకీయ వైరుధ్యాలకు అతీతంగా పనిచేయాలన్న వాజపేయి పిలుపు నేపథ్యంలోనే ఈ అఖిలపక్ష ప్రార్థనా సమావేశాలను తలపెట్టామని చెప్పారు. లక్నో ప్రార్థన సమావేశానికి సైతం కేంద్ర హోం మంత్రి, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం హాజరవుతారని, వాజపేయి బంధువులు సమావేశంలో పాల్గొంటారన్నారు. వాజపేయి చితాభస్మాన్ని లక్నోలోని గోమటి నదిలోనూ అదేరోజు నిమజ్జనం చేయ డం జరుగుతుందన్నారు. కాగా వాజపేయి అస్తి కలశాన్ని దేశంలో ని అన్ని రాష్ట్ర, జిల్లా కేంద్రాలకు పంపాలని, అక్కడా ప్రార్థనా సమావేశాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు యాదవ్ చెప్పారు.

కేరళ వరద బాధితులకు బాసట
ఇలావుండగా కేరళలో వరద బాధిత ప్రజలకు బాసటగా నిలవాలని పార్టీ నిర్ణయించిందని ఆయన చెప్పారు. అక్కడి బాధితులకు చేపట్టే సహాయక చర్యల్లో తమ పార్టీ దక్షిణాది రాష్ట్రాల కార్యకర్తలు పాలొంటారని ఇంటికీ వెళ్లి బాధితులతో మాట్లాడతారని ఆయన తెలిపారు. రాష్జ్ర పార్టీ విభాగాలకు చెందిన శ్రేణులు వరద పీడిత ప్రజల సహాయార్థం ధన, వస్తు రూపేణ విరాళాలు సేకరిస్తున్నాయని బీజేపీ జాతీయ కార్యదర్శి పి. మురళీధర్ రావు ఈ సందర్భంగా తెలిపారు. అలాగే వైద్య సహాయార్థం వైద్య బృందాలను కూడా బాధిత ప్రాంతాలకు పంపుతున్నట్లు వివరించారు. ఇప్పటికే కేరళకు ఆరు వందల కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రధాని మోదీ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. బాధితులకు పంట బీమా వంటి ఆర్థిక సాయాలను వెంటనే అందించాల్సిందిగా ఇన్సూరెన్స్ కంపెనీలను ప్రధాని ఆదేశించడం జరిగిందన్నారు.