జాతీయ వార్తలు

ఏ ప్రాతిపదికన చానళ్లపై కేసులు పెట్టారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో 2016 ఫిబ్రవరిలో జరిగిన నిరసన ప్రదర్శనలపై చేసిన ప్రసారాలకు సంబంధించి మూడు వార్తా చానళ్లపై కేసులు ఏ ప్రాతిపదికన పెట్టారో వివరించాలని కేంద్ర సమాచార కమిషన్ ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ కేసులో ఇంతకు ముందు కోరిన మేరకు 30 రోజుల్లో ఎందుకు సమాచారం ఇవ్వలేక పోయారో తెలియజేయాలంటూ ప్రభుత్వ అధికారులకు కమిషన్ షోకాజ్ నోటీసులను జారీచేసింది. జరిమానా ఎందుకు విధించరాదో తెలియజేయాలని ఆదేశించింది. కాగా అప్పట్లో జేఎన్‌యూలో జరిగిన ఆందోళనలకు సంబంధించిన వీడియోలను మూడు చానళ్లు మార్పులు చేసి ప్రసారం చేశాయన్న అభియోగాలపై కేసులు నమోదయ్యాయి. ఈ మూడు వార్తా చానళ్లలో ఒక చానల్‌కు సంబంధించిన సంపాదకుడి అభ్యర్థనను సమూలంగా ఆలకించిన కేంద్ర సమాచార శాఖ కమిషనర్ యశోవర్ధన్ ఆజాద్ ఢిల్లీ ప్రభుత్వానికి కేసులకు సంబందించిన సమూల సమచారాన్ని అందజేయాల్సిందిగా కోరారు. ఫిర్యాదు చేయడంలో అనుసరించిన విధానం, ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఏ ఆధారాలు సమర్పించింది వివరించాలని సమాచార కమిషనర్ కోరారు. సంపాదకుడి విజ్ఞప్తితో కూడిన దరఖాస్తును ఢిల్లీలోని వివిధ శాఖల అధికారులకు పంపినప్పటికీ తగిన స్పందన లేకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. తమపై వచ్చిన కేసులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకునే హక్కు అభియోగాలను ఎదుర్కొంటున్న ఎడిటర్‌కు ఉందని ఆజాద్ పేర్కొన్నారు. ఈ కేసులో తమపై ఆరోపణలకు సంబంధించి నేరపూరిత ఆధారాలతో కూడిన మెటీరియల్ ఏమి సమర్పించారు, నిజనిర్ధారణకు జరిగిన విచారణ వివరాలు, ఎవరి ఆదేశాల మేరకు తనతోబాటు మరో రెండు చానళ్ల సంపాదకులపై చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసులు పెట్టారో ఆ సంపాదకుడు తెలుసుకోగోరుతున్నాతున్నారని సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్‌కు కమిషనర్ వివరించారు. ఒక వేళ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రకారం చానళ్లు వాస్తవాలను పక్కనపెట్టి వార్తలను రిపోర్టు చేసివుంటే అతిమంచి పద్ధతి కాదని అది వార్తల పారదర్శకతకు ఆటంకం కలిగించేది అవుతుందన్నారు. అయితే ప్రసార సాధనాల వార్తలను ఖండించిన ఈ విధానం ప్రజాస్వామ్యానికి నాలు స్తంభం వంటి జర్నలిజం నిజాయితీని ప్రభావితం చేస్తుందని ఆయన అన్నారు. ఈ విషయంలో నాన్చుడు ధోరణి, వ్యతిరేకత అనుమానాలకు తావిస్తుందని ఆజాద్ పేర్కొన్నారు. కాగా ఇంతకు ముందు ఎడిటర్ అభ్యర్థన మేరకు తాము పంపిన దరఖాస్తులకు 30 రోజుల్లో ఎందుకు సమాచారం ఇవ్వలేకపోయారో తెలియజేయాలని సమాచార కమిషనర్ ఢిల్లీలోని ప్రభుత్వ శాఖల అధికారులకు షోకాజ్ నోటీసులను జారీచేశారు. ఇలావుండగా 2016 ఫిబ్రవరి 9న ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు జరిపిన నిరసన ప్రదర్శలపై మార్పులు (డాక్టోరల్) చేసిన వీడియోలను మూడు చానళ్లు ప్రసారం చేశాయన్నది అభియోగం. 2001లో పార్లమెంట్‌పై దాడికి సంబంధించిన కేసులో నిందితుడు అప్జల్‌గురును అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఆందోళన జరిగినట్లు చానళ్లు ప్రసారం చేశాయన్నది ప్రధాన అభియోగం. ఈ వార్త దేశంలోని ఒక వర్గాన్ని ప్రభావితం చేయడంతో విశ్వవిద్యాలయానికి చెందిన పలువురు విద్యార్థులను అరెస్టు చేయడం జరిగింది. ఈ వివాదంలో కొంతమంది విద్యార్థులు దేశ వ్యతిరేక నినాదాలు చేసిన వీడియోలు సంబంధిత చానళ్లు సాక్ష్యాలుగా ప్రసారం చేశాయి.. ఇందులో మార్పులు చేసిన వీడియోలను ప్రసారం చేయడం ద్వారా మూడు చానళ్లు శాంతిభద్రతలకు, విద్యార్థుల భవిష్యత్తుకు విఘాతం కలిగించాయంటూ ఢిల్లీ ప్రభుత్వం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ఆ చానళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టును కోరడం జరిగింది.