జాతీయ వార్తలు

రైల్వేల అభివృద్ధికి సహకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 22: తెలంగాణ రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి సహకారం అందించాలని కేంద్రానికి కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. వినోద్ కుమార్ బుధవారం రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్‌తో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో రైల్వే శాఖకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, కొత్త రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, తెలంగాణలోని పలు స్టేషన్లలో రైళ్ల నిలుపుదలపై కేంద్ర మంత్రి గోయల్‌తో వినోద్ చర్చించారు. నాలుగేళ్లగా తెలంగాణలో రైల్వే అభివృద్ధి, సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దక్షిణ మధ్య రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటికీ స్పందించడం లేదని కేంద్ర మంత్రికి వివరించారు. గత బడ్జెట్‌లో కొత్త లైన్లు, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, మరమ్మత్తులకు నిధులు కేటాయించినా పనులు ఆశించినంత వేగంగా సాగడం లేదని కేంద్ర మంత్రికి వివరించారు. గతంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. అలాగే హుజారాబాద్ మీదుగా కరీంనగర్-ఖాజీపేట్ కొత్త రైల్వే లైన్ వేయాలని గోయల్‌కి విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది డిసెంబరులో ప్రవేశపెట్టనున్న సప్లిమెంటరీ బడ్జెట్‌లో ఈ రైల్యే లైన్ నిధులు కేటాయించాలని కోరారు. ప్రస్తుతం ముంబై-నిజామాబాద్ వరకు నడుస్తున్న లోకమాన్య తిలక్ రైలును కరీంనగర్ వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ వినోద్‌కుమార్ చేసిన విజ్ఞప్తులను పరిశిలిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్టు వెల్లడించారు.