రాష్ట్రీయం

జాతీయ ప్రాముఖ్యత సంస్థగా ఎన్‌ఐడీ అమరావతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ)ను జాతీయ ప్రాముఖ్యత గల సంస్థగా గుర్తిస్తూ కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అలాగే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విజయవాడ పేరును నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అమరావతిగా మారుస్తూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. 2014 నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ చట్టంద్వారా ఆంధ్రప్రదేశ్‌తోపాటుగా దేశంలో మరో మూడు సంస్థలు ఎన్‌ఐడి భోపాల్ (మధ్యప్రదేశ్), ఎన్‌ఐడీ జోర్‌హాట్ (అసోం), ఎన్‌ఐడీ కురుక్షేత్ర (హర్యానా)లను కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ నాలుగు సంస్థలను జాతీయ ప్రాధాన్యత గల సంస్థలుగా గుర్తిస్తూ కేంద్ర మంత్రి మండలి చట్ట సవరణ చేసేందుకు ఆమోదం తెలిపింది. గుజరాత్‌లోని ఎన్‌ఐడీ అహ్మదాబాద్‌తో సమానంగా జాతీయ ప్రాముఖ్యత గల సంస్థగా గుర్తించబడుతుంది. వచ్చే శీతాకాల సమావేశంలో జాతీయ ప్రాముఖ్యత సంస్థలుగా ఈ చట్ట సవరణకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీనివల్ల డిజైన్లలో అత్యున్నత నైపుణ్యం గల వారిని తీర్చిదిద్దేందుకు అవకాశం కలుగుతుంది.