జాతీయ వార్తలు

ఉద్రిక్తతలు నివారించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 12: భారత్, పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను నివారించేందుకు అమెరికా అవసరమైన సానుకూలమైన చర్యలు తీసుకుంటుందని అమెరికా అధికార వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్‌తో చర్చలు జరపాలంటే ముందుగా సరిహద్దు ఉగ్రవాదం, చొరబాట్లను ప్రోత్సహించడాన్ని పాక్ మానుకోవాలన్న భారత్ నిర్ణయానికి తమ దేశం మద్దతు ఉంటుందన్నారు. అప్పుడే ఇరు దేశాల మధ్య చర్చలకు సానుకూలమైన వాతావరణం నెలకొంటుందని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల రెండు దేశాల ప్రధానమంత్రులు కూడా ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్న ద్పక్పథంతో ఉండడం మంచి పరిణామమన్నారు. ఇరు దేశాల మధ్య ఏదో ఒక రకంగా చర్చల ప్రక్రియ ప్రారంభం కావాలి. భద్రతా సలహాదారుల మధ్య లేక డీజీఎంవోల మధ్య ఈ చర్చలకు నాంది పలకాలి. ఇరు దేశాల మధ్య రవాణా సదుపాయం మెరుగుపరచడం, ప్రజల రాకపోకలను ప్రోత్సహించడం కూడా ఉద్రిక్తతలు తగ్గేందుకు దోహదపడుతుందని దక్షిణాసి దేశాల వ్యవహారాల ఉప సహాయ కార్యదర్శి ఎలైస్ వెల్స్ పేర్కొన్నారు. పాక్‌తో నిర్మాణాత్మక సంబంధాలు ప్రారంభం కావాలంటూ కోరుతూ భారత్ ప్రధాని నరేంద్రమోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు లేఖ పంపించారు. ఇమ్రాన్ ఖాన్‌కు పాజిటివ్‌గాస్పందించారని, కాశ్మీర్‌తో సహా అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలు పంపారని అమెరికా గుర్తు చేసింది. ఇరుదేశాల మధ్య వీలైనంత త్వరలో చర్చలు ప్రారంభం కావాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. కాగా పాకిస్తాన్ ఉగ్రవాదుల ఏరివేతను ప్రారంభించాలని, వారికి ఆశ్రయం కల్పించరాదని అమెరికా పాకిస్తాన్‌ను గట్టిగా కోరింది. 2016 నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. పాకిస్తాన్ భారత్‌కు చెందిన గూఢచారి జాదవ్‌కు శిక్ష విధించడం కూడా ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారేందుకు ఆస్కారం ఇచ్చినట్లయింది. వాస్తవాధీనరేఖ వద్ద ఇరు దేశాల మధ్య కాల్పులు జరగడం కూడా సంబంధాలు క్షీణించేందుకు దోహదపడుతున్న అంశమని అమెరికా గుర్తించింది.