రాష్ట్రీయం

విదేశాల్లో అవినీతిపై దర్యాప్తులో వెనుకబడిన భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: విదేశాలతో సంబంధం ఉన్న అవినీతి వ్యవహారాలపై దర్యాప్తు విషయంలో మన దేశం చాలా వెనుకబడివుంది. స్వల్పంగా దర్యాప్తు చేయిస్తున్న, అసలు దర్యాప్తే చేయని దేశాల్లో మన దేశం కూడా ఒకటని అంతర్జాతీయ అవినీతి నిరోధక శాఖ పారదర్శక విభాగం బుధవారం నాడిక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఇందుకు ఇటలీకి చెందిన అగస్టావెస్ట్‌ల్యాండ్ కంపెనీ నుంచి 12 హెలిక్యాప్టర్ల కొనుగోలు వ్యవహారంపై తలెత్తిన వివాదాన్ని, అవినీతి ఆరోపణలను ఉదహరించింది. ఈ వ్యవహారంపై క్రిమినల్ కేసులు నమోదుచేసి దర్యాప్తు చేయాలని సూచించినా స్పందన ఆ శాఖ నివేదిక వెల్లడించింది. ప్రత్యేకించి చైనా, హాంగ్‌కాంగ్, భారత్, సింగపూర్ దేశాలు ఇలాంటి వ్యవహారాల్లో అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తును పటిష్టవంతం చేయలేకపోతే అది ప్రగతికి నిరోధకంగా మారుతుందని స్పష్టం చేసింది. ప్రత్యేకించి విదేశీ మార్కెట్లో ఈ దేశాల ప్రాముఖ్యత తగ్గే అవకాశం ఉందని అంతర్జాతీయ అవినీతి నిరోధక పారదర్శక విభాగానికి చెందిన 2018 ఎగుమతి వ్యవహారాల అవినీతి నివేదిక హెచ్చరించింది. ఈ రకమైన అవినీతి వల్ల అంతర్జాతీయ ఆర్థిక రంగంతోబాటు సంబంధిత దేశాల ప్రజలు నష్టపోయే అవకాశం వుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో రెండు, అంతకన్నా అధిక శాతం ఎగుమతులు చేస్తున్న చైనా, హాంకాంగ్, భారత్, సింగపూర్ దేశాలకు ‘అంతర్జాతీయ ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) అవినీతి నిరోధక కనె్వన్షన్‌లో సభ్యత్వాలు లేకపోవడం గమనార్హం. ఈక్రమంలో ఈ దేశాలు అంతర్జాతీయ క్లాసిఫికేషన్‌లో దిగువకు చేరాయి. 2014 నుంచి 2017 వరకు జరిగిన వివిధ వ్యవహారాలకు సంబంధించి ఈ దేశాల పనితీరును బేరీజువేసి ఈ క్లాసిఫికేషన్ జరిగింది. ఈక్రమంలో ఓఈసీడీ అవినీతి నిరోధక కనె్వన్షన్‌లో సభ్యులు కావాలని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ఈ దేశాలకు విజ్ఞప్తి చేసింది. 1997లో ఏర్పాటైన ఓఈసీడీ అవినీతి నిరోధక కనె్వన్షన్ ఎగుమతుల వ్యహారాల్లో తలెత్తే అవినీతి కేసుల్లో ఎగుమతి దారుల తరపున పనిచేస్తుంది. ఈ కనెన్షన్‌లో 44 దేశాలు సభ్యత్వం కలిగివున్నాయి. ఇందులో 36 దేశాలు అంతర్జాతీయ ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ)లో భాగస్వాములు. అమెరికన్ కనె్వన్షన్‌లో ఈ అంతర్జాతీయ అవినీతికి సంబంధించి చైనా, భారత్, హాంకాంగ్‌లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇందుకు సంబంధించి సరైన దర్యాప్తు విభాగాల ఏర్పాటు విషయంలో ఈ దేశాలు అంతగా ఆసక్తిని చూపించడం లేదని నివేదిక వెల్లడించింది. దేశాల మధ్య అంతర్గత సంబంధాలకు విఘాతం కలిగించే ఇలాంటి వ్యవహారాలపై ఇకనైనా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నివేదిక సూచించింది. అంతర్జాతీ అవినీతిపై దర్యాప్తు ఫలితాలను ప్రచురించాల్సిందిగా కోరినప్పటికీ భారత్ నుంచి స్పందన లేదని నివేదిక స్పష్టం చేసింది. అసలు ఆ దర్యాప్తు బృందాలవద్ద ఇందుకు సంబంధించిన డేటా ఉందన్నది కూడా అనుమానాస్పదమేనని పేర్కొంది. ప్రస్తుత అవినీతి నిరోధక చట్టాన్ని సవరిస్తూ గత జూలైలో భారత పార్లమెంటు బిల్లును ఆమోదించింది. ఇందులో లంచం ఇచ్చిన వారిని సైతం దోషులుగా పేర్కొనడం తెలిసిందే. అలాగే భారత దేశానికి సంబంధించిన వ్యాపారాలు చేసే విదేశీ సంస్థల ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు, సబ్‌కాంట్రాక్టర్లకు కూడా ఈ కొత్తచట్టం కిందికి వచ్చారు. దేశంలో విదేశీ అవినీతిని క్రిమినల్ నేరంగా పరిగణించకపోతే దర్యాప్తు సంస్థల పనితీరును అంచనా వేయడం సులభం కాదని బెర్లిన్‌లో విడుదలైన ఈ నివేదిక వెల్లడించింది. దేశీయంగా జరిగే అవినీతే విదేశాల్లో భారీ అవినీతికి కారణభూతం అవుతోంది. ఈ కేసుల విషయంలో 39 దేశాలతో పోలీస్తే భారత్ నుంచి పరస్పర న్యాయ సహకారంలో సైతం అవసరమైనంత ప్రగతి లేదని నివేదిక అభిప్రాయపడింది. క్రిమినల్ లా విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మరింత చొరవ తీసుకుని పరస్పర న్యాయ సహాయం కోసం కృషి చేయాలని నివేదిక సూచించింది. ప్రత్యేకించి సంబంధిత డాక్యుమెంట్లను విదేశీ భాషల్లోకి తర్జుమా చేయడంలో సైతం జా ప్యం జరుగుతోందని పేర్కొంది. ఫ్రాన్స్‌కు చెందిన ఏయిర్‌బస్ (విమానం) కొనుగోళ్ల విషయంలో నెలకొన్న అవినీతిలో భారత్‌తో పాటు 16 దేశాలు ఇబ్బందుల పాలయ్యాయని, 2013లో భారతీయ అధికారులకు లంచం ఇవ్వబోయిన ఓ కెనడియన్ పౌరుడికి విధించిన శిక్షను ఆ దేశంలోని ఒంటారియో కోర్టు రద్దు చేసిన విషయాన్ని ఉదహరించింది. అలాగే సెక్యూరిటీ స్క్రీనింగ్ పరికరాలను భారత్‌కు సరఫరా చేసే విషయంలో కెనడాకు చెందిన ఓ మం త్రి ప్రమేయం విషయంలోనూ కేసు నిలువలేదని, దర్యాప్తు నిర్వహణ లోపమే ఇందుకు కారణమని నివేదిక వెల్లడించింది. ఇటలీ లాంటి దేశాల్లో ఈ విషయంలో శక్తివంతమైన దర్యాప్తు బృందాలున్నాయని నివేదిక వెల్లడించింది.