జాతీయ వార్తలు

మంచి నిర్ణయం ఆశిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 12: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలులో ఉన్న ఏడుగురు దోషుల విడుదలపై తమ కేబినెట్ ప్రతిపాదనల మేరకు రాష్ట్ర గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ మంచి నిర్ణయం తీసుకుంటారని విశ్వసిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. ప్రజల మనోభావాలు, వారి అభిప్రాయాలను గౌరవించే దిశగా కేబినెట్ నిర్ణయం తీసుకుందని రాష్ట్ర మత్యశాఖ మంత్రి డి.జయకుమార్ బుధవారం ఇక్కడ పత్రికా ప్రతినిధుల సమావేశంలో తెలిపారు. రాజీవ్ హంతకులు నళిని, ఆమె భర్త శ్రీహరన్ అలియాస్ మురుగన్, పెరరివాలన్, రాబర్ట్ పయాస్, జయకుమార్, రవిచంద్రన్, శంతన్‌లను జైలు నుంచి విడుదల చేయాలని ఈనెల 9న రాష్ట్ర కేబినెట్ గవర్నర్‌కు ప్రతిపాదించింది. తమిళనాడు ప్రజల మనోభావాలు, అభిప్రాయాలు, అంచనాలకు అనుగుణంగా గవర్నర్ సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం, విశ్వాసం తమకు ఉన్నాయన్నారు. రాజీవ్ హంతకుల విడుదలపై గవర్నర్ పురోహిత్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారని నమ్ముతున్నామన్నారు. ఈ విషయంలో ఎలాంటి జాప్యం జరిగినా తమ ప్రభుత్వం గవర్నర్‌పై ఎలాంటి ఒత్తిడి తీసుకువస్తుందా అనే ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలేదు. హంతకుల విడుదల అంశంపై ఉన్న సమస్య తీవ్రతను గుర్తించడం వల్లే తమ కేబినెట్ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. ప్రజల తరఫున సమష్టి నిర్ణయాన్ని తీసుకుని కేబినెట్ వ్యవహరించిందని, ఈనెల 9నే గవర్నర్‌కు కేబినెట్ నిర్ణయాన్ని తెలియజేసినట్టు తెలిపారు. జైలు శాఖ ప్రతిపాదనలు, దోషుల రికార్డులను సైతం గవర్నర్‌కు అందజేశామని తెలిపారు. ఈ విషయమై గవర్నర్ సముచిత నిర్ణయం తీసుకోవచ్చునని సుప్రీం ఈనెల 6న సూచించిన విషయాన్ని ఆయన పేర్కొన్నారు.