జాతీయ వార్తలు

వైకాపాదే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇండియాటుడే- ఆక్సెస్ మై ఇండియా వీక్లీ సర్వేల్లో వెల్లడైంది. అలాగే తెలంగాణలో కే చంద్రశేఖరరావు మళ్లీ సీఎం అవుతారని సర్వే పేర్కొంది. ఇండియా టుడే శుక్రవారం ఈ వీక్లీ సర్వేలను ప్రసారం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని తెలిపింది. జగన్ సీఎం కావాలని 43 శాతం మంది కోరుకుంటున్నట్టు సర్వే వెల్లడించింది. చంద్రబాబునాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావాలని 38 శాతం మంది భావిస్తున్నారని తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కేవలం ఐదు శాతం మందే కోరుకుంటున్నట్టు సర్వే పేర్కొంది. తెలంగాణలో కే చంద్రశేఖరరావు మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని 43 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నట్లు ఇండియాటుడే సర్వే చెబుతోంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డికి 18 శాతం మంది మద్దతు ఇస్తే బీజేపీ శాసన సభా పక్షం నాయకుడు జీ కిషన్ రెడ్డికి 15 శాతం మంది ఓటర్ల మద్దతు లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే సంవత్సరం ఏప్రిల్, మేలో జరిగే శాసనసభ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తోందని ఇండియా టుడే వీక్లీ సర్వే ప్రకటించింది. తమ సర్వే ప్రకారం ఏపీలో ఇతరులకు 14 శాతం మంది మద్దతు లభించిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ 8-12 తేదీల మధ్య 10,500 మంది అభిప్రాయాలు తెలుసుకోవటం ద్వారా తామీ అంచనాకు వచ్చినట్లు ఇండియాటుడే తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పని తీరు పట్ల ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 43 శాతం మంది తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.