రాష్ట్రీయం

మార్కెట్‌లో మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: ఇక్కడి బాగ్రీ మార్కెట్‌లోని బహుళ అంతస్తుల భవనంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిపమ్రాదం చోటుచేసుకుంది. ఈ భవనంలో వివిధ వ్యాపారాలకు సంబంధించిన సుమారు వెయ్యి నివాస గృహాలున్నాయి. ఈ ఘటనలోప్రాణనష్టమేదీ జరగలేదని, మంటలను అదుపుచేసే క్రమంలో అగ్నిమాపక సిబ్బందిలోని ఇద్దరికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ఇక్కడి రిజర్వు బ్యాంకు కార్యాలయానికి సుమారు కిలోమీటరు దూరంలో ఈ బాగ్రీ మార్కెట్ ఉంది. అగ్నికీలలను పూర్తిగా అదుపుచేసేందుకు 24 నుంచి 48 గంటలు పడుతుందని పశ్చిమ బెంగాల్ అగ్నిమాపక దళ, అత్యవసర సర్వీసుల విభాగం డైరెక్టర్ జనరల్ జగ్‌మోహన్ తెలిపారు. భవనంలోని దాదాపు నాలుగైదు అంతస్తులు పూర్తిగా మంటల్లో కాలిపోయాయని అయన చెప్పారు. దుకాణాల్లోని ప్లాస్టిక్ ఆటవస్తువులు, బట్టలు, రసాయనాల వంటివి మంటల తీవ్రతకు దోహదం చేశాయని ఆయన తెలిపారు. సుమారు అరవై యేళ్ల క్రితం నిర్మితమైన ఈ భవనంలో మంటలను అదుపుచేసేందుకు 30 అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దింపామన్నారు. తొలిదశగా బయటి నుంచి విరజిమ్మామని, అందువల్ల భవనంలోపలికి వెళ్లేందుకు సిబ్బందికి అవకాశం ఏర్పడిందని, ఈ క్రమంలోనే ఇద్దరు ఫైర్‌మెన్ గాయాలపాలయ్యారని తెలిపారు. తెల్లవారు జామున సుమారు 2.30 గంటల ప్రాంతంలో భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ప్రమాదం చోటుచేసుకుని అగ్ని జ్వాలలు భవనంపై అంతస్తులోకి వ్యాపించాయన్నారు. కాగా జర్మనీ, ఇటలీ దేశాల్లో జరిగే వ్యాపార శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు ఉదయం 9.45 గంటలకు బయలు దేరిన రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రమాదంలో భవనం లోపల ఎవరూ చిక్కుకుని లేరని స్పష్టం చేశారు. కాగా షాపులు దగ్థమై సర్వస్వం కోల్పోయామని వ్యాపారులు వాపోతున్నారు.