జాతీయ వార్తలు

అర్బన్ నక్సల్స్‌ను సమర్థిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్: మావోయిస్టులు నగరాల్లో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఏర్పాటు చేసిన అర్బన్ నక్సల్స్ భావజాలాన్ని సమర్థించే విధంగా ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ధ్వజమెత్తారు. ప్రధాని మోదీని హత్య చేసేందుకు అర్బన్ నక్సల్స్ కుట్రపన్నారని ఆయన ఆరోపించారు. అర్బన్ నక్సల్స్ సంస్కృతిపై రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న అభియోగంపై మహారాష్ట్ర పోలీసులు కొంత మంది మావోయిస్టు పార్టీ సానుభూతిపరులను ఇటీవల అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. శుక్రవారం ఆయన ఇక్కడ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ గెలుస్తుందని రాహుల్ బాబా పగటి కలలు కంటున్నారన్నారు. ప్రధాని మోదీని హతమార్చేందుకు కుట్రపన్నిన అర్బన్ నక్సల్స్‌కు రాహుల్ గాంధీ మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. దేశ ప్రధానిని హతమార్చేందుకు కుట్రపన్నినవారిని పోలీసులు అరెస్టు చేయకుండా ఎలా ఉంటారన్నారు. ఈ ఎన్నికల్లో ఈ అంశంపై రాహుల్ గాంధీ స్పష్టంగా తన అభిప్రాయాలను తెలియచేయాలన్నారు. రాష్ట్రంలో 90 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 65 సీట్లు గెలుచుకుంటుందన్నారు. 2003 నుంచి బీజేపీ ఇక్కడ అధికారంలో ఉందని ఆయన ఎప్పారు. నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో బీజేపీ గెలుస్తోందన్నారు. పేదలు, యువత, రైతుల సముద్ధరణకు బీజేపీ పాటుపడుతోందన్నారు.