జాతీయ వార్తలు

ఆధార్ తప్పనిసరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అనేక అంశాలకు ఆధార్ నంబర్ అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ రూపొందించిన ఆధార్ చట్టంపై కొనసాగుతున్న వివాదానికి బుధవారం తెరపడనుంది. ఆధార్ అనుసంధానం తప్పనిసరి అవుతుందా? కాదా? అనే విషయం తేలనుంది. ఆధార్ చట్టానికి ఉన్న రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలయిన పలు పిటిషన్లను కలిపి విచారించిన సుప్రీంకోర్టు బుధవారం తన తీర్పు వెలువరించనుంది. వివిధ అంశాలకు ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయడం మానవ హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని, పౌరులపై సాధ్యమయినంత మేరకు నిరంతరం నిఘా వేయడం ద్వారా రాజ్యాంగం వారికి ఇచ్చిన గోప్యత హక్కును హరించడమే అవుతుందని వాదిస్తూ ఈ పిటిషన్లు వేర్వేరుగా దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు ఏకే సిక్రీ, ఏఎం ఖన్‌విల్కర్, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్‌తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లింటిని కలిపి విచారించింది. తీర్పును వాయిదా వేస్తున్నట్టు మే 10న ప్రకటించింది. విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ చట్టం తేవడాన్ని సమర్థించుకుంది. ఇది ప్రభుత్వం తీసుకున్న విధానపరమయిన నిర్ణయమని వాదించింది. పౌరుల వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉంటుందని స్పష్టం చేసింది.