జాతీయ వార్తలు

వాద్రాకు భారీ ముడుపులు....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: హెచ్‌ఏఎల్ సంస్థకు రావలసిన శిక్షణా విమానాల తయారీ కాంట్రాక్టును 2012లో ఫిలటస్ అనే స్విట్జర్లాండ్ సంస్థకు ఇప్పించటం ద్వారా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావమరిది రాబర్ట్ వాద్రా పది లక్షల స్విస్ ఫ్రాంకుల ముడుపులు పుచ్చుకున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. దేశాన్ని దోచుకున్న గాంధీ కుటుంబానికి శిక్ష తప్పదు.. రాబర్ట్ వాద్రా త్వరలోనే జైలుకు వెళతాడని పాత్రా తెలిపారు. గాంధీ కుటుంబానికి లంచం తినే అవకాశం జారిపోయినందుకు, రాహుల్ రాజకీయంగా ఎదిగేలా చేసేందుకే కాంగ్రెస్ అధినాయకత్వం రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. రాబర్డ్ వాద్రాతో చేతులు కలిపిన ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారీకి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో దస్సాల్ట్ సంస్థతో ఒప్పందం కుదరనందుకే యూపీఏ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని మరుగున పడవేసి దేశ భద్రతకు తీరని ముప్పు తెచ్చింది. 42 స్వాడ్రన్ల యుద్ధ విమానాలు ఉండవలసిన భారత వాయుసేనను 32 స్వాడ్రన్లకు తగ్గించి వేసిందని సంబిత్ పాత్రా మంగళవారం విలేఖరుల సమావేశంలో ఆరోపించారు. సంజయ్ భండారీకి చెందిన పర్యటన సంస్థ ఇచ్చిన టికెట్లపై వాద్రా స్విట్జర్‌లాండ్ వెళ్లి వచ్చారంటూ పాత్రా టికెట్లకు సంబంధించిన అన్ని వివరాలను మీడియా ముందు పెట్టారు. రాబర్డ్ వాద్రా లండన్‌లో కొనుగోలు చేసిన ఇంటి ఫోటో, ఇతర వివరాలను వెల్లడించారు. 35వేల పౌండ్ల ఖర్చుతో ఈ ఇంటిని ఆధునీకరించారని పాత్రా తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయన్నారు. రాహుల్ గాంధీ రాఫెల్ యుద్ధ విమానం తోకపై కూర్చుని చేస్తున్న రాజకీయం విజయవంతం కాదని స్పష్టం చేశారు. రాబర్డ్ వాద్రా ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారీతో కలిసి దేశాన్ని దోచుకున్నారు. లండన్‌లో 19కోట్ల ఖర్చుతో ఒక ఇల్లు కొన్నాడు.. భండారీ ఇచ్చిన టికెట్లపై స్విట్జర్లాండ్ వెళ్లి అక్రమ డబ్బును అక్కడి బ్యాంకుల్లో దాచుకున్నారని పాత్రా ఆరోపించారు. రాఫెల్ విమానాల తయారీ ఒప్పందం హెచ్‌ఏఎల్‌కు రాకుండా చేశారంటూ బీజేపీపై ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ 2012లో శిక్షణా విమానాల తయారీ హెచ్‌ఏఎల్‌కు రాకుండా ప్రైవేట్ కంపెనీకి రాబర్ట్ వాద్రా ఇప్పించి పెద్దఎత్తున లంచం పుచ్చుకోలేదా? అని సంబిత్ పాత్రా ప్రశ్నించారు. రాబార్డ్ వాద్రాపై తాను చేసిన ఆరోపణలకు రాహుల్ గాంధీ ఈ రోజే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సంజయ్ భండారీ ఆయుధాల సరఫరా సంస్థ ఆఫ్‌సెట్ ఇండియా సల్యూషన్స్ అధినేత 2008 నుండి 2014 వరకు ఎన్నో రక్షణ ఒప్పందాలు చేయించారని ఆయన తెలిపారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి పదవి చేపట్టగానే ఈ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయించారన్నారు. భండారీకి చెందిన 18చోట్ల అధికారులు దాడులు చేసినప్పుడు లభించిన పత్రాల్లో రాఫెల్ ఒప్పంద పత్రాలు కూడా లభించాయని పాత్రా చెప్పారు. సంజయ్ భండారీపై ఫిలటస్ ఎయిర్‌క్రాఫ్ట్ డీల్ కేసు నడుస్తోందన్నారు. ఫిలటస్ శిక్షణా విమానం కొనుగోలు కోసం యూపిఏ ప్రభుత్వం 12 నియమాలను సవరించిందని పాత్రా ఆరోపించారు. శిక్షణా విమానాల తయారీ కాంట్రాక్ట్ కోసం హెచ్‌ఏఎల్ పోటీ పడుతుంటే దానిని ప్రయత్నాలను దెబ్బకొట్టి ఫిలటస్ సంస్థకు ఇప్పించి డబ్బు తీసుకున్న వ్యక్తి భండారీ అని సంబిత్ పాత్రా తెలిపారు. రాబర్డ్ వాద్రా మూలంగానే హెచ్‌ఏఎల్‌కు రావలసిన కాంట్రాక్టును ఫలటస్ అనే స్విట్జర్‌లాండ్ సంస్థకు ఇచ్చారని పాత్రా ఆరోపించారు. ఈ కుంభకోణంలో పది లక్షల ప్రాంక్‌లు సంజయ్ భండారీకి లభించాయని, ఆ డబ్బును స్టాండర్డ్ చార్టర్ బ్యాంకులో జమ చేశారని ఖాతా నంబర్‌ను తెలిపారు. సంజయ్ భండారీ ద్వారా ఈ డబ్బు రాబర్డ్ వాద్రాకు చేరిందని సంబిత్ పాత్రా ఆరోపించారు. డెల్ట్భాండారీ హాట్‌మేయిల్ డాట్ కాం ద్వారా ఒక్కొక్కటి ఎనిమిది లక్షలు విలువ చేసే రెండు టికెట్లను రాబర్డ్ వాద్రాకు భండారీ అందజేశారని ఈ టికెట్లకు సంబంధించిన వివరాలు, టికెట్ల ఫోటోలు, ఫ్లైట్ నంబర్లను ఆయన వెల్లడించారు. ఫిలటస్ ఒప్పందం జరగ్గానే రాబర్డ్ వాద్రా అక్రమ డబ్బును జ్యూరిక్ వెళ్లి బ్యాంకుల్లో జమ చేశారని పాత్రా ఆరోపణలు కురిపించారు. రాబర్ట్ వాద్రాపై తానీరోజు చేసిన ఆరోపణలకు రాహుల్ గాంధీ ఇదే రోజు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.