జాతీయ వార్తలు

ఇది ఆరంభమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ప్రజాధనాన్ని ‘క్రోనీ’ మిత్రులకు దోచిపెడుతున్న నరేంద్ర మోదీ * ప్రధానిపై విరుచుకుపడ్డ రాహుల్
అమేథి, సెప్టెంబర్ 25: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ప్రభుత్వంపై తన దాడిని మరింత తీవ్రం చేశారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు, విజయ్ మాల్యాకు సంబంధించిన వివాదాలపై త్వరలోనే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు. తన స్వంత నియోజకవర్గం అమేథి నుంచి ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై దాడికి దిగారు. అమేథి పార్లమెంటరీ నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పర్యటించిన రాహుల్ గాంధీ చివరి రోజు మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ ‘ఇది ఆరంభం మాత్రమే’ అని వ్యాఖ్యానించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు, లిక్కర్ బారన్ విజయ్ మాల్యా పరారీ వెనుక ఉన్న వారి గురించి మరెన్నో వాస్తవాలు బయటకు రావలసి ఉందని ఆయన అన్నారు. ‘వాస్తవాలు మీ ముందుకు వస్తాయి. మీరు తీర్పు ఇవ్వగలరు’ అని రాహుల్ అన్నారు. అంతకు ముందు రాహుల్ గాంధీ పార్టీ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఫ్రాన్స్ నుంచి 36 యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం యువత ప్రయోజనాలకు ఎంతో హాని కలిగించిందని రాహుల్ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఏఎల్ యూనిట్‌ను అమేథిలో పెట్టాలని అప్పటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయించగా, దాన్ని బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఇక్కడి నుంచి తరలించుకు పోయిందని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఏఎల్‌ను భాగస్వామిని చేయాలని నిర్ణయించగా, తరువాత ఏర్పడిన ఎన్‌డీఏ ప్రభుత్వం హెచ్‌ఏఎల్‌ను కాదని అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్‌కు అవకాశం కల్పించడంపై కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా కేంద్రంపై ధ్వజమెత్తుతోంది.

న్యాయస్థానం ముందు నిలబెడతాం
న్యూఢిల్లీ: హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) కార్మికులతో పాటు జవాన్లు, వాయుసేన అధికారులు, అమరవీరులయిన పైలట్ల కుటుంబాలకు అయిన గాయాలను, నొప్పిని తాను అర్థం చేసుకున్నానని రాహుల్ గాంధీ అన్నారు. వీరందరి గాయాలను, నొప్పిని అర్థం చేసుకోవడంతో పాటు, వారిని అగౌరవపరచిన, ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టడానికి పాటుపడతానని ఆయన తెగేసి చెప్పారు. రాఫెల్ డీల్ విషయంలో ఆయన ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీపై మరోసారి దాడికి దిగారు. ప్రధాని మోదీ ప్రభుత్వ ధనాన్ని తన ‘క్రోనీ’ మిత్రుల జేబుల్లో నింపుతున్నారని రాహుల్ దుయ్యబట్టారు.