జాతీయ వార్తలు

చొరబాటుదారులను వెళ్లగొట్టే ప్రక్రియ ఆపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్: అక్రమ చొరబాటుదారులను దేశం నుంచి బయటకు పంపే ప్రక్రియను ఎట్టిపరిస్థితుల్లో నిలిపివేయమని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా స్పష్టం చేశారు. ఇటీవల అసోం రాష్ట్రంలో చేపట్టిన జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సి) ద్వారా 40 లక్షల మంది అక్రమ నివాసితులను గుర్తించామని ఆయన చెప్పారు. ఇలాంటి వారిని గుర్తించి దేశం నుంచి పంపే ప్రక్రియను నిలిపివేయమని, ఇది కొనసాగుతుందని ఆయన తెలిపారు. భారతీయ జనసంఘ్ సహ వ్యవస్థాపకుడు దీన్‌దయాళ్ జయంతి సందర్భంగా ఇక్కడ జరిగిన బిజేపీ కార్యకర్తల సమావేశం ‘కార్యకర్త మహాకుంభ్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమైన సమస్యలను ప్రస్తావించకుండా కాంగ్రెస్ పార్టీ ఏవేవో ఆరోపణలు చేస్తోందని అన్నారు. అభివృద్ధి, జాతీయత, రక్షణ లాంటి విషయాల్లో బీజేపీకి పోటీ లేదని ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్‌లో అధికారం లోకి రావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పగటి కలలు కంటున్నారని అన్నారు. ఆయన కలలు కనడం మాని 2014 నుంచి జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో తాము ఎందుకు అధికారం కోల్పోయామో ఒకసారి అవలోకన చేసుకోవడం మంచిదని ఆయన సూచించారు. 2014 నుంచి కాంగ్రెస్ పలు రాష్ట్రాల్లో అధికారం కోల్పోగా, బీజేపీ ఓటు శాతం మాత్రం గణనీయంగా పెంచుకుంటున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2014కు ముందు ఎంపీలో కాంగ్రెస్ పరిస్థితిని ఒకసారి గుర్తుకు తెచ్చుకుని తర్వాత రాహుల్ మాట్లాడాలన్నారు. రాహుల్ పగటి కలలు కనడాన్ని ఎవరూ ఆపరని, ఆయితే ఆయన వాస్తవాలు మరువరాదన్నారు.