జాతీయ వార్తలు

‘ఆకాశరామన్న’లను పట్టించుకోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: ఆకాశరామన్న ఫిర్యాదులపై వెంటనే స్పందించి ప్రభుత్వ అధికారులపై చర్యలకు ఉపక్రమించవద్దని సంబంధిత విభాగాలకు కేంద్రం ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడ్డారంటూ గుర్తుతెలియని వ్యక్తుల చేస్తున్న ఫిర్యాదులను కేంద్ర శిక్షణ, సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ తీవ్రంగా పరిగణించింది. అలాంటి ఫిర్యాదులపై ఆచీతూచి వ్యవహరించాలని అన్ని ప్రభుత్వ శాఖలకు సూచించింది. కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులపైనా ఈ తరహా ‘అవినీతి’ ఫిర్యాదులు కోకోల్లలుగా వస్తున్న విషయాన్ని మంత్రిత్వశాఖ గుర్తించింది. ప్రభుత్వం ఉద్యోగి/ ఉద్యోగినిపై ఇలాంటి ఫిర్యాదులు ప్రభుత్వం అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్(సీవీసీ)కి లెక్కకు మిక్కిలిగానే వస్తున్నాయి. సీవీసీ కూడా ఇలాంటి ఆదేశాలనే అన్ని ప్రభుత్వ శాఖలకు ఇచ్చింది. ఊరూపేరూ లేకుండా ప్రభుత్వ ఉద్యోగులపై చేస్తున్న అవినీతి ఆరోపణలు, ఫిర్యాదులను పట్టించుకోనక్కర్లేదని స్పష్టం చేశారు.