జాతీయ వార్తలు

శబరిమల పవిత్రతను కాపాడాలి....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, అక్టోబర్ 10: శబరిమల ఆలయ ప్రవేశ వివాదం కేరళను కుదిపేసింది. మహిళలు ఆలయ ప్రవేశానికి అనుమతి ఇస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలుచేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ హిందూ సంస్థలు ఆందోళన చేపట్టాయి. హిందూ సంస్థలు రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించాయి. సుప్రీం తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేయకపోవడాన్ని వారు తప్పుపట్టారు. శబరిమల ఆలయ పవిత్రను కాపాడాలంటూ భక్తులు, మహిళలు బుధవారం వివిధ ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎర్నాకులం జిల్లాలోని అలువ, మువాతుపుఝా జనానికి, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. బీజేపీ కార్యకర్తలు రాష్ట్ర దేవాదాయ మంత్రి కడంపల్లి సుందేశన్‌కు నల్లజండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కఝాకూటమ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోపక్క బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ పథానామ్‌తిట్ట జిల్లా నుంచి ప్రారంభించిన నిరసన యాత్ర ఈనెల 15వ తేదీనాటికి సచివాలయానికి చేరుకుంటుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్ శ్రీథరన్ పిళ్లై, భారత ధర్మ జనసేన అధ్యక్షుడు తుషార్ వల్లాపల్లి ర్యాలీకి నాయకత్వం వహిస్తున్నారు. అయ్యప్ప భక్తుల విశ్వాసాలను ప్రభుత్వం మంటగలుపుతోందని పిళ్లై ఆరోపించారు. ఇలా ఉండగా నవంబర్ 17న ప్రారంభంకానున్న మండల-మక్కరవిల్లకు పండుగ కోసం ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ఏర్పాట్లు చేపట్టింది. శబరిమల వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడడమే ప్రభుత్వ కర్తవ్యమని సుందరేశన్ వెల్లడించారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు అమలు చేయడమే ప్రభుత్వ విధి అని, ఈ విషయంలో ఆందోళనలకు ఆస్కారమే లేదని మంత్రి స్పష్టం చేశారు. సుప్రీం తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయకపోవడాన్ని బీజేపీ, కాంగ్రెస్, పలు హిందూ సంస్థలు నిరసిస్తున్నాయి. కేరళలోని వామపక్ష ప్రభుత్వం మాత్రం సుప్రీం తీర్పు అమలుకే కట్టుబడి ఉంది.