జాతీయ వార్తలు

పట్టాలు తప్పిన ఫరక్కా ఎక్స్‌ప్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మృతుల సంఖ్య పెరిగే అవకాశం * దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
* మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన రైల్వే, యూపీ ప్రభుత్వం
* ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వేబోర్డు చైర్మన్, ఎన్‌డీఆర్‌ఎఫ్ దళాలు
* విద్రోహ కుట్ర కోణంపై ఉగ్రవాద వ్యతిరేక విభాగం దర్యాప్తు
* రైల్వే, పోలీస్ శాఖ వేర్వేరుగా దర్యాప్తు
లక్నో/న్యూఢిల్లీ, అక్టోబర్ 10: ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి వద్ద బుధవారం ఉదయం ఢిల్లీకి వెళుతున్న న్యూ ఫరక్కా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన దుర్ఘటనలో ఏడుగురు ప్రయాణీకులు మరణించారు. తొమ్మిది మంది ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెప్పారు. పశ్చిమబెంగాల్‌లోని మాల్డా నుంచి న్యూఢిల్లీకి ఈ రైలు వెళుతోంది. ఉదయం 6.10 గంటలకు ఈ రైలులోని తొమ్మిది కోచ్‌లు పట్టాలు తప్పాయి. న్యూ ఫరక్కా ఎక్స్‌ప్రెస్ (14003) రాయబరేలిలోని హర్‌చంద్రాపూర్ వద్ద పట్టాలు తప్పిన ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్లు రైల్వే శాఖ ఆదేశించింది. ఈ ఘటనపై పోలీసు శాఖ కూడా విచారణ చేస్తుందని ఉత్తర ప్రదేశ్ అదనపు డైరెక్టర్ జనరల్ శాంతి భద్రతల విభాగగం ఆనంద్ కుమార్ చెప్పారు. ఈ ఘటనలో 30 నుంచి 35 మంది ప్రయాణీకులకు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిలో నలుగురికి లక్నోలోని కింగ్ జార్జి వైద్య ఆసుపత్రిలో ట్రామా సెంటర్‌లో వైద్య చికిత్సను అందిస్తున్నారు. మరో ఇద్దరు ప్రయాణీకులకు సంజయ్ గాంధీ పీజీ వైద్య సంస్థలో వైద్య సహాయం అందిస్తున్నట్లు యూపీ ప్రభుత్వ ప్రతినిధి శ్రీకాంత్ శర్మ చెప్పారు. ఈ ఘటన లక్నోకు 80 కి.మీ దూరంలో సంభవించింది. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణీకులను ఢిల్లీకి చేరవేసేందుకు మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. నిరాశ్రయులైన 1369 మంది ప్రయాణీకులకు ఆహారం, మంచినీటి సదుపాయాన్ని కల్పించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. క్షతాగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలు, గాయపడిన ప్రయాణీకుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రకృతి విపత్తు యాజమాన్య దళం, యూపీ రైల్వే పోలీసులు అన్ని రకాల సహాయాన్ని అందించాలని ప్రధానమంత్రి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపిన వారికి రూ.1 లక్ష చొప్పున, స్వల్పంగా గాయాలు తగిలిన వారికి రూ.50వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. రైల్వేశాఖలో ఉత్తరసర్కిల్ సేఫ్టీ కమిషనర్ ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రైల్వే మంత్రి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్ తెలిపారు.
ప్రమాదం సంభవించిన సమాచారం తెలిసిన వెంటనే రైల్వే బోర్డు చైర్మన్ అశ్విని లోహాని రైలు పట్టాలు తప్పి ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. ఆయన సహాయ చర్యలను పర్యవేక్షించారు. 40 మంది బృందంతో ఉన్న ప్రకృతి విపత్తు యాజమాన్య దళం ఘటనా ప్రదేశానికి చేరుకుంది. ఘటనా ప్రదేశం వెనక విద్రోహుల కుట్ర దాగి ఉందనే కోణంపై యాంటీ టెర్రరిస్టు దళం దర్యాప్తును చేపట్టింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ రైల్వేస్టేషన్‌లో హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. రైల్వే సేఫ్టీ చీఫ్ కమిషనర్ శైలేష్‌పాటక్ విచారణను ప్రారంభించారు.