జాతీయ వార్తలు

బీజేపీ హయాంలో పెచ్చుమీరిన అవినీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కాంగ్రెస్ కార్యకర్తలు జనంలోకి వెళ్లాలి
* కేంద్రం, రాష్ట్రంలో బీజేపీని గద్దె దించాలని రాహుల్ పిలుపు
జైపూర్, అక్టోబర్ 10: బీజేపీ హయాంలో అవినీతి పెచ్చుమీరిందని, యువతకు బూటకపు కబుర్లు చెప్పి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన ప్రధాన నరేంద్రమోదీకి వచ్చే ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ సర్కార్‌ను గద్దె దించేవరకు విశ్రమించరాదని ఆయన కోరారు. రైతులు, యువత, పారిశ్రామివేత్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ దగాకోరు విధానాల వల్ల తీవ్రంగా నష్టపోయారన్నారు. రాఫెల్ ఫైటర్ జెట్స్ ఒప్పందంలో కోట్లాదిరూపాయల అవినీతి జరిగిందని, దీనికి సమాధానం ఇవ్వలేక ప్రధాని నరేంద్రమోదీ తడబాటుకు గురవుతున్నారన్నారు. ఇక్కడ జరిగిన యువజన కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని దుమ్మెత్తిపోశారు. రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందని, గిట్టుబాటు ధరలు లేక విలవిలలాడుతున్నారన్నారు. దేశంలో బడాపారిశ్రామికవేత్తలకు అనుకూలంగా మోదీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తలు జనంలోకి వెళ్లి మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం సమష్టిగా కృషి చే యాలన్నారు. ప్రజలకు మోదీ, వసుంధర రాజే ప్రభుత్వ విధానాల్లోని అవకతవకలను వివరించాలన్నారు. కార్యకర్తలు అంకిత భావంతో పనిచేయాల ని, పార్టీకి కార్యకర్తలే పునాది అన్నారు. బూత్ స్థా యి నుంచి పార్టీని పటిష్టం చేస్తున్నామన్నారు. పార్టీసిద్ధాంతాలను జనంలోకి తీసుకెళ్లాలన్నారు. పారిశ్రామిక రంగం తిరోగమనంలో ఉందన్నారు. పెద్ద నోట్ల రద్దు పెద్ద తప్పిదమన్నారు. బ్యాంకింగ్ రంగం కుదేలైందన్నారు. దోల్పూర్, భరత్‌పూర్, దౌసా జిల్లాల్లో రాహుల్ ఎన్నికల ర్యాలీలు, రోడ్ షోల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ ప్రతినిధి అశోక్ చాందనా మాట్లాడుతూ సభలకు ప్రజలు భారీగా తరలివస్తున్నారన్నారు. రాహుల్ నాయకత్వంలోనే దేశం అభివృద్ధి జరుగుతుందన్నారు.