జాతీయ వార్తలు

ఎదురు కాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, అక్టోబర్ 11: నిషేధిత తీవ్రవాద సంస్థ హిజ్‌బుల్ ముజాహిద్దీన్‌కు గురువారం పెద్ద ఎదురుదెబ్బతగిలింది. టాప్ కమాండర్ మనాన్ బషీర్‌వానీని ఉత్తర కాశ్మీర్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో భద్రతా దళాలు మట్టుబెట్టాయి. అతని అనుచరుడు కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు పోలీసువర్గాలు తెలిపాయి. కాగా కుప్వారా జిల్లాలోని హంద్వారా ప్రాంతంలోగల షాత్‌గండ్ గ్రామంలో బషీర్‌వానీతోబాటు మరో ఇద్దరు మిలిటెంట్లు ఉన్నారని విశ్వసనీయ సమాచారం అందుకున్న భద్రతాదళాలు గురువారం తెల్లవారుజామున పోలీసులతో కలిసి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి లొంగిపోవాల్సిందిగా మిలిటెంట్లను హెచ్చరించాయి. అయితే మిలిటెంట్లు భద్రతాదళాలపై కాల్పులకు దిగడంతో రెండువైపుల నుంచి తీవ్రస్థాయిలో ఎదురుకాల్పులు ఉదయం 11 గంటల వరకు సాగాయి.