జాతీయ వార్తలు

రాజీనామాల పేరుతో డ్రామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామాల పేరుతో ఢిల్లీలో డ్రామాలు ఆడారని తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆరోపించారు. గురువారం ఢిల్లీలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సాధారణ ఎన్నికలకు ఏడాది సమయం గడువు దాటిన తర్వాత లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చేత రాజీనామాలను ఆమోదింపజేయించుకొని, మళ్లీ ఎన్నికల రాకుండా తెలివిగా వ్యవహరించారని ఆరోపించారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఎంపీలు సాధారణ ఎన్నికలకు ఒక ఏడాది ముందుగానే రాజీనామాలు ఆమోదం పొందవుంటే మళ్లీ ఎన్నికలకు వచ్చేవని అన్నారు. ఓడిపోతామనే భయంతోనే బీజేపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ లాలుచీ పడ్డాయని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేసే అర్హత ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డికి, ఆ పార్టీ నేతలకు లేదని చెప్పారు. చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాస్‌పోర్టులు కేంద్రం రద్దు చేయాలని ఎంపీ విజయ సాయిరెడ్డి డిమాండ్ చేయడం సరికాదని రమేష్ అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని తాను దీక్షచేసి 100 రోజులైనప్పటికీ, కేంద్రం ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేదని ఆయన గుర్తుచేశారు. వచ్చే శనివారం తెలుగుదేశం ఎంపీలందరం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌ను కలుస్తామని ఆయన చెప్పారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారా లేదా అన్న విషయం పది రోజుల్లో తేల్చాల్సిందిగా కేంద్ర మంత్రిని నిలదీస్తామని రమేష్ స్పష్టం చేశారు.