జాతీయ వార్తలు

మలేసియాలో ‘మన ఆధార్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: భారత్‌లో విజయవంతమైన ‘ఆధార్’పై మలేసియా ఆసక్తిచూపుతోంది. మలేసియాలో సంక్షేమ పథకాల అమలులో దీన్ని ఆధారం చేసుకోవాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం జాతీయ గుర్తింపు కార్డు విధానంలో మార్పులు చేయాలని మలేసియా భావిస్తోంది. సంక్షేమ పథకాల ఫలాలు అర్హులకే అందేలా, సబ్సిడీల్లో అవకతవకలు అరికట్టడానికి భారత్‌లో అమలు చేస్తున్న యూనిక్‌ఐడీ విధానానే్న మలేసియా అనుసరించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ మేనెలలో కౌలాలంపూర్ పర్యటన సందర్భంగా మలేసియా ప్రధాని మహతీర్ మహ్మద్‌తో అనేక అంశాలపై చర్చించారు. ఈ సందర్భగా ఇరువురు దేశాధినేతల మధ్య ఆధార్ ప్రస్తావనకు వచ్చింది. భారత్‌లో విజయవంతమై చక్కని ఫలితాలు ఇస్తున్న ఆధార్‌ను తామూ అన్వయించుకోవాలని నిర్ణయించుకున్నట్టు మలేసియా మానవ వనరుల మంత్రి ఎం కుల సేగరన్ ఆదివారం వెల్లడించారు. కులసేగరన్ నాయకత్వంలో బృందం భారత్‌లోని బ్యాంకర్లు, ఆర్థిక మంత్రిత్వశాఖ, హెచ్‌ఆర్‌డీ ఉన్నతాధికారులతో భేటీ అయింది. దీనికి మలేసియా కేబినెట్ ఆమోదం తెలిపింది. మలేసియా ప్రతినిధుల బృందం కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమై ఆధార్ పనితీరుపై అడిగి తెలుసుకున్నారు.‘యూనిక్ ఐడింటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) సీఈవో అజయ్ భూషణ్ పాండేతో మేం సమావేశమయ్యాం. మాదేశ గుర్తింపుకార్డు మైకాడ్ పనితీరును వారి దృష్టికి తీసుకెళ్లాం’అని హెచ్‌ఆర్‌డీ మంత్రి కుల సేగరన్ వెల్లడించారు. సంక్షేమ పథకాల అమలు సక్రమంగా జరగాలన్న ఉద్దేశంతోనే ఆధార్‌ను తామూ అన్వయించుకోవాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. వ్యక్తిగత గోప్యతకు సంబంధించి ప్రతిపక్షాల నుంచి తామూ విమర్శలు ఎదుర్కొంటున్నామని ఆయన అన్నారు. అందువల్లే భారత్ అనుసరిస్తున్న విధానాలు తాము నమూనాగా తీసుకుని ముందుకెళ్తామని చెప్పారు. అయితే వ్యక్తిగత గుర్తింపుకార్డుల విధానం మలేసియాలో దశాబ్దాలుగా కొనసాగుతోందని, కాబట్టి ఆధార్ వల్ల కొత్తగా వచ్చే ప్రమాదం ఏదీ ఉండదని మంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధి పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందించాలన్నదే తమ ఉద్దేశమని, నకిలీలను అరికట్టాలంటే ఆధార్ లాంటి గుర్తింపుకార్డు అవసరమని తమ ప్రభుత్వం భావించిందని ఆయన వెల్లడించారు.‘మా దేశంలో ఇంధనం సబ్సిడీ ఉంది. కొన్ని వర్గాలకే దాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే అందరూ సబ్సిడీ పొందుతున్నారు. ఆధార్ కార్డు లాంటి విధానం ఉంటే ప్రభుత్వ ఉద్దేశం నెరవేరుతుంది. నిజమైన లబ్ధిదారులకే సబ్సిడీ దక్కుతుంది’అని ఆయన స్పష్టం చేశారు. అలాగే తాము చెక్కులు, నగదు రూపేణా చెల్లిస్తున్నామని, యూనిక్‌ఐడీ కార్డు అమలుచేస్తే లబ్ధిదారుల ఖాతాల్లోకే నేరుగా నగదు బదిలీ చేయవచ్చని ఆయన తెలిపారు.