జాతీయ వార్తలు

జడ్జి అంగరక్షకుడికి 4 రోజుల రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుర్గావ్, అక్టోబర్ 14: జడ్జి భార్యపై కాల్పులు జరిపి, ఆమె మృతికి కారకుడైన అంగరక్షకుడు మహిపాల్‌కు కోర్టు నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించింది. అడిషనల్ సెషన్స్ జడ్టి కృష్ణకాంత్ సతీమణి రీతూ(45), కుమారుడు ధృవ్(18)పై వారి అంగరక్షకుడే కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడ్డ రీతూ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారని గుర్గావ్ ప్రభుత్వ ఆసుపత్రి ఆర్‌ఎం పవన్ చౌదరి ఆదివారం వెల్లడించారు. ధృవ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఆయన తెలిపారు. తల్లీ, కొడుకుపై ఆర్కాడియా మార్కెట్ వద్ద మహిపాల్ కాల్పులు జరిపాడు. శనివారం సాయంత్రం 3.30 గంటల ప్రాతంలో ఈఘటన చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. తీవ్రంగా గాయపడ్డ రీతూ, ధృవ్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్టు వారు చెప్పారు. కాగా కాల్పులకు తెగబడ్డ మహిపాల్‌ను గుర్గావ్ కోర్టుకు హాజరుపరచగా 4 రోజుల పోలీసు రిమాండ్ విధించారు. జడ్జి భార్య, కుమారుడిపై కాల్పులు జరపాల్సి రావడానికి గల కారణాలపై లోతుకంటూ దర్యాప్తు చేయాలని వారం రోజులు అంగరక్షకుణ్ని అప్పగించాలని పోలీసులు కోర్టును అభ్యర్థించారు. కాగా పోలీసుల విచారణలో నిందితుడు పొంతనలేని సమాధానాలు ఇస్తున్నాడు. కుటుంబ సమస్యల వల్ల తీవ్రమైన నిస్పృహలో ఉన్నానని మహిపాల్ చెప్పాడు. హర్యానా పోలీసు శాఖలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మహిపాల్ రెండేళ్లగా న్యాయమూర్తివద్ద అంగరక్షకుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. సొంతూరు వెళ్లడానికి సెలవుకావాలని గత కొన్ని రోజులుగా అడుగుతున్నాడని దర్యాప్తు అధికారి ఒకరు వెల్లడించారు. అందరూ చూస్తుండగానే జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది.