జాతీయ వార్తలు

చక్రం తిప్పేది మేమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమతో పొత్తుకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) విముఖత చూపినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం చలించిపోలేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ రాష్ట్ర రాజకీయాలను నిర్దేశించే స్థితిలో ఉందని, త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమతో పొత్తుకు సుముఖత చూపుతున్న పక్షాలన్నింటితో సంప్రదింపులు జరుపుతోందని రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి నేతృత్వం వహిస్తున్న జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. 14ఏళ్ల పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడిన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు కాంగ్రెస్ రూపొందించిన ప్రణాళికను ముందుకు తీసికెళ్లడానికి పార్టీ రాష్ట్ర నాయకత్వం, శ్రేణులు దృఢచిత్తంతో ఉన్నాయని ఆయన ఆదివారం ఇక్కడ ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లను బీఎస్‌పీ చీలుస్తుందా? అని ప్రశ్నించగా, ‘అలా జరుగుతుందని నేను అనుకోవడం లేదు. సహజంగానే, కూటమి కడితే కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. అయితే, ఈ రోజు ఉన్న నెలకొని ఉన్న పరిస్థితుల్లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి విస్తృతమయిన మద్దతు ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలంతా పార్టీని అధికారంలోకి తీసుకు రావాలనే దృఢచిత్తంతో ఉన్నారు. ప్రజలు మార్పు కోసం మా వైపు చూస్తున్నారు. అందువల్ల, మేము తప్పకుండా రాష్ట్ర రాజకీయాలను నిర్దేశించే స్థితిలో ఉన్నాం’ అని సింధియా అన్నారు. బీఎస్‌పీ పొత్తుకు విముఖత చూపిన నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ), గోండ్వానా గణతంత్ర పార్టీతో పొత్తు గురించి అడిగిన ఒక ప్రశ్నకు ఆయన బదులిస్తూ, ‘మాతో పొత్తుకు సుముఖత చూపుతున్న అన్ని పక్షాలతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం. భారతీయ జనతా పార్టీని ఓడించడమే మా లక్ష్యం. రాష్ట్రంలో కూటమి ఏర్పాటు అవకాశాలను మేము ఇప్పటికీ తోసిపుచ్చడం లేదు’ అని అన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీలకు త్వరలో జరుగనున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని బీఎస్‌పీ అధ్యక్షురాలు మాయావతి ప్రకటించిన నేపథ్యంలో జ్యోతిరాదిత్య సింధియా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే, వచ్చే సంవత్సరం జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పరిస్థితి మరోలా ఉంటుందని, రాష్ట్రాల వారీ పొత్తులు సత్ఫలితాలు ఇవ్వకుంటే 2019లో కూటమి కట్టే అవకాశాలు ఇప్పటికీ ఉన్నాయని జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. ‘మార్పుకు ఇదే తగిన సమయం’ అనేది తమ పార్టీని రాజకీయాలను నిర్దేశించే స్థితిలో నిలుపుతోందని, ఇది కేవలం నినాదం కాదని, వాస్తవ పరిస్థితి అని, మార్పుకోసం అంకితం కావడం అని ఆయన అన్నారు. తాము ఈ ఎన్నికల్లో మోదీ, శివరాజ్ సింగ్ చౌహాన్ అంశాల వల్ల పోరాడటం లేదని, ప్రజల కోసం పోరాడుతున్నామని ఆయన పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ ప్రజలు గత 14 సంవత్సరాలుగా బీజేపీ పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుణ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జ్యోతిరాదిత్య సింధియా అన్నారు.